ఒకరేమో సీనియర్ మోస్ట్ స్టార్ హీరో.. ఇంకో ఇద్దరేమో యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరోలు. అయితేనేమి సీనియర్ హీరో దెబ్బకు ఆ ఇద్దరు ఔట్ అయ్యారు.
మెగా స్టార్ చిరంజీవి తాజాగా నటించి.. ఇటీవల విడుదలై.. బంఫర్ హిట్ సాధించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమాను చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించగా.. సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు.
తమిళంలో బుల్లితెరపై యంగ్ హీరోలు ప్రభాస్ నటించిన బాహుబలి, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ లకంటే ఎక్కువగా రేటింగ్ ను సొంతం చేసుకుంది.
తమిళంలోసైరాకు 15.44 టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ బాహుబలి 2 కి 10.33 టీఆర్పీ వచ్చింది. ‘స్పైడర్’ తమిళ్ టెలివిజన్ ప్రీమియర్ 10.4 టీఆర్పీ ని సొంతం చేసుకుంది….