Home / 18+ / వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ న్యూ లుక్స్ ..!

వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ న్యూ లుక్స్ ..!

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతున్న సందర్బంలో చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ చిత్రయూనిట్‌ను మందలించాడట రాజమౌళి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం బయల్దేరాడు. ఇందులో అల్లూరి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసినదే. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఒక్కడే ఈ చిత్ర షూటింగ్‌లో ఉన్నాడు.

ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించబోతున్నాడు దర్శకధీరుడు రాజమౌలళి.  ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో భార్య ఉపాసనతో చరణ్ వెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ మెగా పవర్ స్టార్ లుక్స్ కూడా నెట్టింట్లో బాగానే సందడి చేస్తున్నాయి. కోరమీసాలతో కిరాక్ పుట్టిస్తున్నాడు మెగా వారసుడు. ప్రస్తుతం ఈ లుక్స్ ఉన్నా  ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఈ లుక్స్ చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సినిమా తర్వాత వరసగా స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయనున్నాడు చరన్ ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూ మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. త్వరలో చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో రానున్న సినిమాను ఈయనే నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat