Home / NATIONAL / పౌరసత్వ సవరణ చట్టం పై ఐరాస విశ్లేషణ..!

పౌరసత్వ సవరణ చట్టం పై ఐరాస విశ్లేషణ..!

పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి  ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఫర్హాన్ హక్ పెదవి విరిచారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లులో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి నిశితంగా విశ్లేషిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్ అన్నారు. భారతదేశ చట్ట సభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తమకు తెలుసని, అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి కూడా తమకు తెలుసని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు. ఈ కొత్త చట్టం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న విషయం ఐరాస లో నిశితంమైన  విశ్లేషణ అవసరమన్నారు.

 

 

 

భారత్ చేసిన ఈ కొత్త చట్టంపై ఐరాస మానవ హక్కుల యంత్రాంగం తీవ్ర  విమర్శలు  చేస్తోందన్నారు. అయితే ఈ చట్టంపై ఐరాస నేరుగా స్పందిస్తుందా? అన్న ప్రశ్నకు.. వేచి చూడాలని అన్నారు. ప్రస్తుతానికైతే పౌరసత్వ సవరణ చట్టంలో పొందుపరిచిన అంశాలను తాము విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఐరాస విశ్వ మానవ హక్కుల ప్రకటనలో పొందుపరిచిన అంశాలు భారత్ తీసుకు వచ్చన పౌరసత్వ సవరణ చట్టంలో పొందుపరిచి ఉంటారని తాము భావిస్తున్నట్టు తెలియజేసారు. ఈ చట్ట అమలుకు సంబందించి బంగ్లాదేశ్, ఆఫ్గనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల నుండీ ఐరాస కు ఒత్తిడి ఉందని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat