Home / TELANGANA / డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కేసీఆర్‌కే సాధ్యం..!!

డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కేసీఆర్‌కే సాధ్యం..!!

యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం జరుగుతోందని, ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లుభవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌ నియోజక వర్గం రాఘవాపూర్‌ గ్రామంలో నిర్మించిన రెండుపడకల గృహాల సముదయాన్ని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ప్రారంభించారు.

ఈసందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు రెండు పనుల ఉంటాయని, ఒకటి ఇల్లు కట్టడం, రెండోది ఆడపిల్లకు పెళ్లి చేయడం. ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పేదలకు ఏంచేయాలో ఆలోచించారని అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రెండు పడకల ఇళ్లనిర్మాణ పథకం మొదలుపెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుందా? అని అనుకున్యానం. కానీ కేసీఆర్‌ సంకల్ప బలం, పేదల కోసం ఏదో చేయాలన్న తపన వల్లనే డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వని విధంగా కేసీఆర్‌ పేదలకు రెండుపడకల ఇళ్లను ఇస్తున్నారని అన్నారు. పేదలు, రైతులు సీఎం కేసీఆర్‌కు రెండుకళ్లని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat