Home / SLIDER / యువతకు మంత్రి హారీష్ రావు పిలుపు

యువతకు మంత్రి హారీష్ రావు పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ పరిధిలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పఠాన్ చెరులో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ మాట్లాడుతూ” నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పఠాన్ చెరులో ఎడ్యుకేషన్ హబ్ తయారు చేశారు.పిల్లలు ఆడుకోవడానికి మంచి స్టేడియం ఏర్పాటు చేశారు.పదో‌తరగతిలో‌వంద శాతం ఫలితాలు వస్తే ఇంటర్ లో 33శాతానికి, డిగ్రీలో 49 శాతానికి ఎందుకు ఫలితాలు పడిపోయాయి.ఇంటర్ , డిగ్రీ లో వందకు వంద శాతం ఫలితతాలు‌ రావాలి.మార్చి నాలుగు నుంచి ఇంటర్ పరీక్షలు. ఈ 75 రోజులు పిల్లల్ని బాగా చదివించండి.

రెండు రోజుల్లో జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు మద్యాహ్నం బోజనం, సాయంత్రం స్నాక్స్‌ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పేద కార్మిక విద్యార్థులు చదువు తున్నారు‌.కార్మికుకుల‌ పిల్లలు కార్మికులు కావద్దు. ఆఫీసర్లు ,ఇంజనీర్లు , డాక్టర్లు కావాాలి.ఇంటర్, ‌డిగ్రీ విద్యార్థుల దిశ, దశ మార్చేది.వారిని అధ్యాపకులు, తల్లిదండ్రులు మంచిగా మలిచితే గొప్పవారవుతారు.విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించండి.
ప్రతీ లెక్చరర్ కు కొద్ది మంది విద్యార్థులను కేటాయించి బాగా చదివించండి.

గత ఏడాది ఏ సబ్జెక్టు లో‌ ఎక్కువ మంది ఫెయిలయ్యారో గుర్తించి ఆ సబ్జెక్టు లో ఎక్కువ మంది పాస్ అయ్యేలా చదివించండి.పిల్లల్లో చగువులతో పాటు నైతిక విలువలు పెంచాలి. సంప్రదాయాలు నేర్పాలి. సామాజిక ‌స్పృహను పెంచాలి.కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నత వ్యక్తులతో ప్రత్యేక తరగతులు‌ నిర్వహించి పిల్లల్లో సామాజిక బాధ్యత. నేర్పాలి‌.ఆడపిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి. 100 కు ఎందుకు డయల్ చేయాలో వారికి వివరించాలి. మహిళా పోలీసు అధికారులతో అవగాహన కల్పించాలి.ర్యాంకులు, మార్కులు ముఖ్యమే. వాటి కన్నా నైతిక విలువలు ఇంకా ముఖ్యం.విద్యార్థులు సోషల్ మీడియా, టీవీలు, సినిమాలకు దూరంగా ఉండండి”అని పిలుపునిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat