Home / NATIONAL / ప్రధాని మోదీ హత్యకు కుట్ర..!

ప్రధాని మోదీ హత్యకు కుట్ర..!

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన మాదిరిగానే హత్య చేయడానికి కుట్ర జరిగిందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త సారాంశం మీకోసం”

ఎల్గార్‌ పరిషత్‌ కేసులో 9 మంది హక్కుల నేతలు సహా 19 మందిపై ప్రాసిక్యూషన్‌ అభియోగాలను కోర్టుకు సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, దానితో మావోయిస్టు సానుభూతిపరులైన హక్కుల నేతలకు ప్రమేయం ఉందని పుణెలోని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రత్యేక కోర్టులో ఈ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ హక్కుల నేతల్లో విప్లవ రచయిత వరవరరావు, సుధీర్‌ ఽధవాళే, రోనా విల్సన్‌, సురేంద్ర గాడ్లింగ్‌, మహేశ్‌ రౌత్‌, షోమా సేన్‌, అరుణ్‌ ఫెరీరా, వెర్మన్‌ గోంసాల్వెస్‌, సుధా భరద్వాజ్‌ ఉన్నారు.

2017 డిసెంబరు 31న భీమా కోరెగాం ప్రాంతంలో ఎల్గార్‌ పరిషత్‌ సమావేశం జరిగింది. ఇది మావోయిస్టులు ఏర్పాటుచేసినదేనని పోలీసుల ఆరోపణ. దీని అనంతరం బీమా కోరెగాం సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు సాగడం, తదనంతర హింస… రాజకీయంగా దుమారం రేపాయి. వీటికి హక్కుల నేతలే కారణమని ఆరోపిస్తూ ఈ తొమ్మిది మందినీ నిర్బంధించారు. దాదాపు రెండేళ్ల తరువాత ఇపుడు చార్జిషీటు దాఖలు చేశారు. ‘‘రాజీవ్‌గాంధీని శ్రీపెరంబదూర్‌లో హత్య చేసిన తరహాలోనే రోడ్‌ షో జరుపుతున్నపుడు మోదీని కడతేర్చాలని కుట్ర పన్నారు.

ఇందుకోసం రూ 8 కోట్ల నగదు, ఓ అత్యాధునికమైన ఎం-4 రైఫిల్‌, 4 లక్షల రౌండ్ల మందుగుండు, మరికొన్ని మారణాయుధాలను ఓ సప్లయర్‌ నుంచి నేపాల్‌, మణిపూర్‌ మీదుగా తీసుకురావాలని ప్రయత్నించారు’’ అని చార్జిషీటు ముసాయిదా ఆరోపించారు. కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధానికి, కూల్చివేతకు కుట్ర జరిగిందన్నారు. ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌ఆర్‌ నవాండర్‌ వీటిని పరిశీలించి అభియోగాల నమోదుకు ఉత్తర్వు లిస్తే లాంఛనంగా విచారణ సాగుతుంది”అని ఒక వార్త వైరల్ అవుతుంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat