Home / ANDHRAPRADESH / అమరావతిలో బినామీల పేరుతో వేల ఎకరాలు కొల్లగొట్టిన టీడీపీ నేతల లిస్ట్ ఇదే..!

అమరావతిలో బినామీల పేరుతో వేల ఎకరాలు కొల్లగొట్టిన టీడీపీ నేతల లిస్ట్ ఇదే..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపన రేపుతోంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో విషం కక్కిన చంద్రబాబుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో రాజధానిగా ప్రకటించక ముందు నుంచే చంద్రబాబు, టీడీపీ నేతలు, ఒక సామాజికవర్గం పెద్దలు బినామీల పేరుతో రైతుల దగ్గర భూములును చవక ధరకు కొనుక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన భూబాగోతాన్ని బయటపెట్టారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌తో సహా, టీడీపీ మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బినామీల పేరుతో కొన్న భూముల వివరాలను అసెంబ్లీలో బుగ్గన చదివి వినిపించారు. అసలు అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే బాబు బ్యాచ్ 4 వేల ఎకరాలు కొన్నారు. అందులో 90 శాతం బాబుగారి సామాజికవర్గానికి చెందినవారే. 2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు కేవలం ఆర్నెళ్ల వ్యవధిలో 4,070 ఎకరాలను చంద్రబాబు, ఆయన సన్నిహితులు ఎక్కడి నుంచో వచ్చి లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, తుళ్లూరు .. లాంటి మారుమూల పల్లెల్లో కొనడం చూస్తుంటే..ఇది పక్కా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని అర్థమవుతోంది. తన కుల ప్రతికలలో రాజధాని ఏలూరు, గన్నవరం, నూజివీడు అంటూ రకరకాల పేర్లు రాయించి…అందరూ అక్కడ భూములు కొంటుంటే బాబు బ్యాచ్ మాత్రం లింగాయపాలెం, ఉద్ధండరాయపాలెం వంటి మారుమూల పల్లెల్లో భూములు కొన్నారు. బాబుకు అత్యంత సన్నిహితుడు, ఇప్పటి బీజేపీఎంపీ సుజనా చౌదరికే 600 కు పైగా ఎకరాలు బినామీల పేరుతో ఉన్నాయంటే ఏ స్థాయిలో బాబు బ్యాచ్ బినామీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతిలో చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌ 14.22 ఎకరాలు కొనుగోలు చేసింది. ఈ మొత్తం 14.22 ఎకరాలు డైరెక్ట్‌గా హెరిటేజ్‌ఫుడ్స్‌ పేరు మీదే ఉన్నాయి. హెరిటేజ్ ప్రెష్ ఫ్యూచర్ గ్రూపుకు అమ్మేసినా..ఇందులో 10 శాతం వాటా బాబుకు ఉంది. మిగతా హెరిటేజ్ సంస్థలన్నీ బాబు ఫ్యామిలీ చేతుల్లోనే ఉండడం గమనార్హం.

ఇక అప్పటి మంత్రి నారాయణ ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, ప్రమీల అనే తన బంధువులు, ఉద్యోగుల పేరుతో 55.27 ఎకరాల భూమి కొన్నారు. అయితే అసలు రాజధాని ప్రాంతంలో తనకు భూములే లేవని, తన బంధువులు, మిత్రులు భూములు కొనుక్కున్నారని మాజీ మంత్రి నారా‍యణ బీద అరుపులు అరుస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన కూడా నారాయణకు స్థలాలు, పొలాలు ఉన్నాయని చెప్పలేదు, ఆయన బినామీల పేర్లు చదివి మరీ 55 ఎకరాలకు పైగా భూములు పోగేసుకున్నారని వివరించారు. కాగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని తెలిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోండి అంటూ బిల్డప్ ఇస్తున్న నారాయణ, మరి తన బినామీలు అక్కడెందుకు ఆస్తులు కొన్నారో, అది కూడా రాజధాని ప్రకటన రావడానికి ముందు తన బంధులు, మిత్రులు ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారో ఆయనే సమాధానం చెప్పాలి. ఇక అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు బినామీ పేర్లతో కొన్నారు. బాబు హయాంలో నాటి మరో మంత్రి పరిటాల సునీత కూతురు భర్త పేరు మీద భూమి కొనుగోలు చేశారు. మాజీమంత్రి రావెల కిషోర్‌ బాబు 40.85 ఎకరాలు మైత్రీ ఇన్‌ఫ్రా సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. నాటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ చౌదరి 68.60 ఎకరాలను అభినందన హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కొనుగోలు చేశారు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు చౌదరి 37.84 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేయగా పయ్యావుల కేశవ్‌ చౌదరి పయ్యావుల శ్రీనివాసులు అండ్‌ వేం నరేందర్‌ రెడ్డి పేరుతో 15.30 ఎకరాలు కొన్నారు.

ఇక లోకేష్‌కు బినామీ, వ్యాపార భాగస్వామి అయిన వేమూరు రవికుమార్‌ ప్రసాద్‌ చౌదరి 25.68 ఎకరాలు కొన్నారు. బాబుగారు ఉంటున్న అక్రమనివాసం ఓనర్ లింగమనేని రమేష్‌ 351 ఎకరాలను సుజనా, ప్రశాంత్‌ పేరు మీద, ఇతర కంపెనీలు మీద కొనుగోలుచేశారు. అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌ యాదవ్‌ 7 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ 17.13 ఎకరాలు శశి ఇన్‌ఫ్రా పేరు మీద కొన్నారు. అలాగే నాటి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి 13.50 ఎకరాలను ధూళిపాళ్ల వైష్ణవి, దేవురపుల్లయ్య పేర్లతో కొనుగోలు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి 7.56 ఎకరాలు తన కుమారుడు పల్లె వెంకట కిషోర్‌ కుమార్‌ అని పేరు మీద కొనుగోలు చేశారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు అక్కడ రాజధాని వస్తుందని తెలిసే 2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు 4,070 ఎకరాలు కారుచౌకగా కొన్నారు. అయితే తప్పులు చేసి అంత తేలిగ్గా దొరికిపోవడానికి టీడీపీ నేతలేం ఆషామాషీ మనుషులు కాదు కదా, అన్నీ పక్కాగా లెక్క చూసుకుని మరీ బినామీలను రంగంలోకి దింపారు. తాము బినామీలుగా ఉండాల్సిన వారి కోసం కూడా తమ బినామీలను తెరపైకి తెచ్చారు. అలా ఎకరాలకెకరాలు టీడీపీకి చెందిన నేతలు పోగేసుకున్నారు. తమవాళ్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మొత్తంగా బుగ్గన బయటపెట్టిన పచ్చనేతల బినామీల లిస్ట్ రాష్ట్రవ్యాప్తగా సంచలనం రేపుతోంది.ఇన్నాళ్లూ అమరావతి కలుగులో దాక్కున్న టీడీపీ నేతల బినామీ బాగోతాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో ఎక్కడ తమ వర్గం నేతల భూముల విలువ పడిపోతుందనే భయంతోనే చంద్రబాబు ఇంతగా కడుపు మంటతో రగలిపోతున్నాడు. తన సామాజికవర్గానికి చెందిన కొంత మంది రైతులు, బినామీ వ్యాపారులతో ఆందోళన చేయిస్తున్నాడు. ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించేలా మాట్లాడుతున్నాడు. అదన్న మాట అసలు సంగతి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat