Home / ANDHRAPRADESH / తండ్రి ఆశయానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్ ..!

తండ్రి ఆశయానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్ ..!

ఆశయం ఉన్నతమైంది అయితే ఎన్ని కష్టాలచ్చిన, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న దాన్ని సాధించితీరాలి. ఎవరు సహాయం చేయట్లేదని, అందరు విమర్శిస్తున్నారని ప్రయాణాన్ని ఆపితే మొదలుపెట్టిన ప్రయాణానికి అర్థం ఉండదు. అలానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 11 2011 లో వైఎస్ఆర్ పార్టీతో రాజకీయాలలో ఒక పార్టీ ని స్థాపించి ముందడుగు వేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తనకు తోడుంటుందని నమ్మిన కాంగ్రెస్ పార్టీ తనను లెక్కచేయకపోవడంతో, పార్టీకి రాజీనామా చేసి రాజన్న రాజ్యాన్ని స్థాపించడమే తన ఆశయం అంటు జగన్ ప్రత్యేక రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేశారు. అక్రమ ఆస్తులు కూడబెట్టాడని కేసులు తనను చుట్టుముట్టిన, ఎన్ని అవాంతరాలు ఎదురైన తన లక్ష్యం కోసం అన్నిటిని భరించారు. సంవత్సరం కాలం పాటు జైలు జీవితం కూడా గడిపారు. అయిన ప్రజల్లో తనకున్న నమ్మకం ఇంత కూడా పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడడని తెలంగాణ అంతా వ్యతిరేకించిన చిరునవ్వుతోనే విమర్శలను స్వీకరించాడు.

 

 

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రజాసమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాడు. అప్పుడు అధికారంలో ఉన్న టీడిపి నాయకులు తనను ఎంత అవమానించిన ప్రజల కోసం అన్నింటిని మౌనంగా భరించాడు జగన్..అధికార పార్టీ తప్పుడు నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడంలో జగన్ సఫలీకృతుడయ్యారు. రాజన్న రాజ్యం తెస్తానని  ప్రజాసంకల్ప యాత్ర పేరిట దాదాపు 3648 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మనస్సులో చెరగని ముద్రవేశారు. ప్రతి ఒక్కరిని పలుకరిస్తు వారి బాధలు తెలుసుకుంటు ముందుకు నడిచారు. రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తానని ప్రతి ఒక్క పేదవారి ఆశయాలను నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు జగన్. కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్ర ప్రతి ఒక్కరిని కదిలించింది.

 

 

 

2019లో జరిగిన ఎన్నికలలో జగన్ పార్టీ కి అతిపెద్ద గెలుపును, టీడిపి కి చరిత్రలో గుర్తుండే ఓటమిని తెచ్చిపెట్టింది..నిత్యం విమర్శలు, ప్రతిపక్ష సభ్యుల విమర్శలను స్వీకరిస్తు తన పంథాను మార్చుకుంటు ప్రజలకోసమే జగన్ అంటు పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి వచ్చిన పుట్టినరోజు జగన్ కు ఆనందం తో పాటు సవాళ్లను తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి అయ్యాక సాహోసోపేత నిర్ణయాలను తీసుకుంటు పరిపాలనలో దూసుకుపోతున్నారు జగన్. ఆడపిల్లల పై జరుగుతున్న అత్యాచారాలకు చలించి దిశ చట్టాన్ని తీసుకువచ్చి దేశానంతటిని తన వైపు చూసేలా చేశారు జగన్. అదే విధంగా మూడు రాజధానులంటు ప్రకటించి మరో సంచలనానికి తెరతీశారు.. ఈ సందర్భంలో  వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పటికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat