Home / ANDHRAPRADESH / ఉత్తరాంధ్రలో పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..కారణం ఇదే..!

ఉత్తరాంధ్రలో పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..కారణం ఇదే..!

మూడు రాజధానులపై టీడీపీ స్టాండ్‌ తేలిపోయింది…చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అంటూ అమరావతికే జై కొట్టాడు. రాజధాని ప్రాంతంలో దగ్గరుండి ఆందోళనలు చేయిస్తున్నాడు. అయితే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుపై సీఎం జగన్‌ ప్రకటనను మాజీమంత్రులు, గంటా, కొండ్రు మురళీతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు స్వాగతిస్తూ ఓ తీర్మానం చేసి చంద్రబాబుకు కూడా పంపారు. అయితే బాబు మాత్రం అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలి..ఏపీకి మూడు రాజధానుల వద్దు అనేదే టీడీపీ స్టాండ్ అని.. బోండా ఉమతో ప్రెస్‌మీట్ పెట్టించి చెప్పించాడు. దీంతో చంద్రబాబుకు తీరుకు నిరసనగా ఇవాళ విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలంతా మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు తీరుపై గుర్రుగా ఉన్నారు. కాగా జనవరి 3, 4వ తేదీల్లో చంద్రబాబు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా చాలా రోజుల కిందటే సిద్ధమైంది. అయితే మూడు రాజధానుల విషయంలో వివాదం తలెత్తిన దరిమిలా బాబు ఉత్తరాంధ్రలో పర్యటించేందుకు వెనకడుగు వేస్తున్నాడు. నిజానికి ఉత్తరాంధ్ర ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిని చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీకి చావుదెబ్బ కొట్టారు. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం, విశాఖ, అరకు పార్లమెంట్‌ స్థానాలను సైతం వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టారు. దీంతో ఎన్నికల తర్వాత జిల్లావైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేకపోయారు. ఒక్కసారి కూడా అడుగుపెట్టలేకపోయారు.

అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించేందుకు చంద్రబాబు జనవరి 3, 4 తేదీల్లో విజయనగరం జిల్లాలో జిల్లా సమన్వయకమిటీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు కూడా ఈ మేరకు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ఇంతలో రాజధానుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓవైపు అమరావతిలో రైతుల పేరుతో టీడీపీ ఆందోళనలు చేయిస్తోంది. మరోవైపు టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం కూడా చేశారు. అలాగే తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రలో పర్యటించడం, అందులోనూ తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాని విజయనగరంలో అడుగుపెట్టడం మంచిది కాదని చంద్రబాబు భావించి తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. తాజాగా విశాఖలో పరిపాలన రాజధాని రావడంతో పాటు భోగాపురం విమానాశ్రయానికి కూడా త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినప్పటి నుంచీ జిల్లా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు కూడా తమ ప్రాంతం అభివృద్ధిని వ్యతిరేకిస్తే జనంలో చులకనైపోతామని భయపడుతున్నారు. అందుకే చంద్రబాబు ధైర్యం చేసి జిల్లాలో పర్యటించినా… తాము మనస్పూర్తిగా పాల్గొనలేమనే సంకేతాన్ని అధిష్టానానికి పంపినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు తన ఉత్తరాంధ్ర పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో అమరావతికే మద్దతు ఇస్తున్న చంద్రబాబు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడానికే భయపడుతున్నట్లు తేలిపోయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat