Home / ANDHRAPRADESH / కర్నూల్ జిల్లాలో పెట్రోల్‌ కొంటున్నార..అయితే జాగ్రత్త

కర్నూల్ జిల్లాలో పెట్రోల్‌ కొంటున్నార..అయితే జాగ్రత్త

కర్నూల్ జిల్లాలోని శిరివెళ్ల పెట్రోల్‌ బంక్‌లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్‌బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్‌ బంక్‌లో రూ.100 పెట్రోల్‌ను బైక్‌లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్‌లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్‌ 1/2 లీటర్‌ కూడా లేకపోవడంతో పెట్రోల్‌ బంక్‌ బాయ్‌ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని బాయ్‌ను పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఈ నెల 24న కూడా తాను రూ.100 పెట్రోల్‌ బైక్‌లో పోయించుకు ఆళ్లగడ్డకు వెళ్లి తిరిగి వస్తుండంగా మార్గ మధ్యలోనే పెట్రోల్‌ అయిపోయిందన్నాడు. కాగా తనకు కూడా గతంలో ఇదే పెట్రోల్‌ బంక్‌లో మోసం జరిగిందని మరో వినియోగదారుడు మున్నా ఆరోపించారు. ఈ విషయమై ఎస్‌ఐ తిమ్మారెడ్డి మాట్లాడుతూ తూనికలు కొలతల అధికారులు తనిఖీ చేసి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.

Cheating Case File on Petrol Bunk Management in Kurnool - Sakshi

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat