Home / ANDHRAPRADESH / రాజధానిలో జర్నలిస్ట్‌లపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా..!

రాజధానిలో జర్నలిస్ట్‌లపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా..!

మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సందర్భంగా అమరావతిలో భారీ విధ్వంసానికి కుట్ర చేశారా…మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందా…రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ద్వారా అమరావతిలో అల్లర్లు జరుగుతున్నాయని జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని ఓ పార్టీ ప్రయత్నించిందా…..ఈ రోజు అమరావతిలో జర్నలిస్టులపై దాడి ‎ఘటనను చూస్తే నిజమే అనిపిస్తోంది. డిసెంబర్ 27 ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష కవరేజ్‌ చేస్తున్న జర్నలిస్టులపై అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఓ టీవీ ఛానల్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారారు. వారిని అడ్డుకోవాలని చూసిన మరో మీడియా ప్రతినిధిపైనా కూడా భౌతిక దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో పరిగెడుతున్న జర్నలిస్టులును కాపాడబోయిన పోలీసులపైనే కూడా కొందరు దాడికి తెగబడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ మీడియా వాహనానం అద్దాలను కర్రలతో ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే మీడియా ప్రతినిధుల మీద రైతుల ముసుగులో కావాలనే ఒక పార్టీ కార్యకర్తలు దాడి చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజధానిలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్ర చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఏదో జరిగిపోతుందనే తప్పుడు సంకేతాలను పంపించే ఉద్దేశంతోనే..పక్కా పథకం ప్రకారం మీడియా ప్రతినిధులపైన దాడి జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీడీపీ నాయకులే అమరావతిలో రైతులతో ఉద్యమం చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మీడియా ప్రతినిధులపైన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. గతంలో తాము చాలా సార్లు ఈ ప్రాంతంలో వార్తలు కవర్‌ చేశామని.. కానీ రైతులు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని పలువురు జర్నలిస్టులు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులు కాదని, వారు కచ్చితంగా ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ..గూండాలు కాని అయి ఉంటారని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కాగా అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలను చంద్రబాబు దగ్గరుండి మరీ జరిపిస్తున్న సంగతి తెలిసిందే. మీడియా ప్రతినిధులపై దాడి చేస్తే జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున కవరేజ్ చేస్తుందని, తద్వారా అమరావతిలో ఏదో జరగబోతుందని దేశవ్యాప్తంగా చర్చ జరిగేందుకే అమరావతిలో భారీ విధ్వంసానికి కుట్ర చేశారని..చర్చ జరుగుతోంది. కాగా దీపావళి పండుగ సందర్భంగా చంద్రబాబు జాతీయ మీడియా ప్రతినిధులకు హైదరాబాద్‌లోని తన నివాసంలో భారీ ఎత్తున కాక్‌టెయిల్ పార్టీ ఇచ్చి..ఖరీదైన గిఫ్ట్‌లు బహుకరించాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ ప్రతినిధులపై దాడి జరగడం చూస్తుంటే..పక్కా ప్లాన్ ప్రకారం ఇది జరిగిందని అర్థమవుతోంది. మొత్తంగా రాజధానిలో జర్నలిస్ట్‌లపై దాడి వెనుక టీడీపీ స్కెచ్ ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ దాడి ఘటనలో నిజనిజాలను త్వరలోనే బయటపెట్టాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat