Home / ANDHRAPRADESH / వాహ్…క్యాసీన్ హై…అమరావతిలో పార్టనర్ల పర్‌ఫ్మారెన్స్ అదరహో..!

వాహ్…క్యాసీన్ హై…అమరావతిలో పార్టనర్ల పర్‌ఫ్మారెన్స్ అదరహో..!

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా రంగంలోకి దిగారు. తొలుత చంద్రబాబు అమరావతి ఆందోళనలకు శ్రీకారం చుడితే…ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటన చేయగానే…బాబుగారు రంగంలోకి దిగిపోయారు. నా బంగారు బాతు అమరావతిని చంపేస్తారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు.. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాడు.బాబుగారు స్వయంగా అమరావతిలో అడుగుపెట్టి…ఇంద్ర సినిమాలో చిరంజీవి స్లైల్లో బోర్లా పడుకుని నేలను ముద్దాడాడు… ఒక పక్క టీడీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే చంద్రబాబు మాత్రం కేవలం తన సామాజికవర్గం ప్రయోజనాల కోసం….మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అటూ..భూములిచ్చిన రైతులను రెచ్చగొడుతున్నాడు. ఇక అమరావతిలో తాను ఎంత లొల్లి చేయించినా ఫలితం లేకుండా పోవడంతో చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపారు. పవన్ సార్ అమరావతిలో తుళ్లూరుకు వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులపై తనదైన స్టైల్లో వూగిపోతూ..వీరావేశంతో డైలాగులు కొడుతూ..రోడ్లుమీద వెల్లకిలా పడుకుని సీన్ రక్తి కట్టించాడు..ఈ సీన్ చూసి చంద్రబాబు బోర్లా పడుకుంటే..ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వెల్లకిల్లా పడుకున్నాడు..మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ వైసీపీ నేతలు జబర్దస్త్ పంచ్‌లు ఇస్తున్నారు. మొత్తంగా అమరావతిలో పార్లనర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల పర్‌ఫార్మెన్స్ మాత్రం అదరహో అనే చెప్పాలి. అయితే అమరావతిలో రైతుల్లో ఆందోళనలు ఉండడం సహజం..కాని..ప్రభుత్వం పూర్తిగా రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని చెప్పడం లేదు..అసెంబ్లీతో పాటు ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెబుతోంది. మరోవైపు అమరావతి రైతులకు తగిన న్యాయం చేస్తామని చెబుతోంది. అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాత్రం తమ రాజకీయ లబ్ది కోసం అమరావతి రైతులను రెచ్చగొట్టడం బాధాకరం. మొత్తంగా అమరావతి రైతుల ఆందోళనలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు కాని.. .చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఓవరాక్షన్‌ను మాత్రం ఏపీ ప్రజలు భరించలేకపోతున్నారనేది వాస్తవం..పార్టనర్లు ఇద్దరికీ…అన్ని ప్రాంతాల అభివృద్ధి కంటే..తమ స్వప్రయోజనాలే ముఖ్యంగా కావడం గమనార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat