Home / ANDHRAPRADESH / సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వీడియో…!

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వీడియో…!

ఏపీ సీఎం జగన్‌ అంటే ప్రాణమిచ్చే నేతల్లో కురుప్పాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముందు వరుసలో ఉంటారు. ఏకంగా తన చేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతగా ప్రలోభపెట్టినా పార్టీ ఫిరాయించకుండా తన వెంటే నిలిచిన ఈ మహిళా నేత అంటే జగన్‌కు కూడా అభిమానమే. అందుకే అధికారంలోకి రాగానే పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై మరోసారి తన అభిమానాన్ని చాటుకుంటూ పుష్పశ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ప్రముఖ గాయని మంగ్లీ పాడిన రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న..నీవెంట జనం ప్రభంజనం చూడవే.. అన్నా..అభివృద్దికి పెద్ద దిక్కు….మన జగనన్న..అన్నార్తుల కన్నకొడుకు మన జగనన్న… అంటూ పాడిన పాటపై పుష్పశ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియో అందరిని అలరిస్తోంది. ఈ టిక్‌టాక్ వీడియోలో పుష్పశ్రీవాణి చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు. 16 సెకెన్ల పాటు నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌‌గా మారింది. వైసీపీ అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న ?మన పుష్ప శ్రీవాణి అక్క టిక్ టాక్ వీడియో❤?

Publiée par Chennamsetti Zakeer YSRCP sur Mardi 31 décembre 2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat