2019ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఎఫ్2. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరి సరసన అందాల రాక్షసులు మెహరీన్, తమన్నా అందాలను ఆరబోశారు. ఈ చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడమే కాకుండా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.
ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓ మూవీ రానుందంటూ కొన్నాళ్ళుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. సీక్వెల్లో వెంకీ బెర్త్ కన్ఫాం అయినప్పటికి వరుణ్ తేజ్ ప్లేస్‌లో ఎవరు నటిస్తారా అని పలు అనుమానాలు రేకెత్తాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు వెంకీ.
ఎఫ్3 సీక్వెల్ కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ కాగా, అనిల్ రావిపూడి కొన్ని స్క్రిప్ట్స్ వినిపించారు. వాటిలో ఏ కథను సీక్వెల్ చేయాలో అర్ధం కావడం లేదు. ఇక లీడ్ రోల్స్ తాను, వరుణ్ చేస్తామని, హీరోయిన్లను కూడా ఫైనల్ చేయాల్సి ఉందని అన్నారు వెంకటేష్.