Home / TELANGANA / గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి…!

గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి…!

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలనేతలు, విరాట్ కోహ్లి, పివి సింధూ వంటి వంటి దిగ్గజ క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు ఐఏయస్, ఐపీయస్ అధికారుల దగ్గర నుంచి…విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, వివిధ సామాజిక సంస్థలు, భాగస్వామ్యంతో ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం హరిత ఉద్యమంలా సాగుతోంది. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య కర్నె ప్రభాకర్ తదితరులు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్వీకరించారు. ఈ క్రమంలో మంత్రుల నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన జగదీష్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా సాగాలంటూ పిలుపునిచ్చారు. నేలంతా పచ్చగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. సమజాహితం కోసమే గ్రీన్ ఛాలెంజ్ అని అన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని, ఇప్పుడిప్పుడే ఇది యావత్తు దేశానికి పాకుతోందన్నారు. ఈ క్రమంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ట్రాన్స్‌కో & జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్‌ఎస్‌‌సీడీసీఎల్ సి అండ్ యం డి రఘుమారెడ్డిలకు మంత్రి జగదీష్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. సమాజహితం కోసం.. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు ఒక ఉద్యమంలా ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు. మొత్తంగా ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్పందన రావడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రెవరిస్ కార్పోరేషన్ చేయిర్మెన్ దేవిప్రసాద్ దేవరకొండ శాసనసభ్యులు డి.రవీంద్ర నాయక్ ,రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నరసింహా రెడ్డి టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోమా భరత్ కుమార్ లతో పాటు గ్రీన్ ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ ప్రతినిధి కిషోర్ గౌడ్ టి ఆర్ యస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat