Home / SLIDER / తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వచ్ఛ తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వచ్ఛ తెలంగాణ

తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం స్వచ్ఛ తెలంగాణ, హరిత తెలంగాణగా తయారు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలునిచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో నిర్వహించిన 2వ విడత పల్లె ప్రగతి సభలో వారు మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నెల 339 కోట్ల రూపాయలను ఒక్కరోజు ఆలస్యం చేయకుండా విడుదల చేస్తుందన్నారు. ◆ గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచడం, సమిష్టి ప్రణాళిక, సమిష్టి అభివృద్ధి అనే ఆశయాలతో ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ◆ గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి, ఎవరి గ్రామాన్ని వారె అభివృద్ధి చేసుకునే విధంగా గ్రామస్తులకు గ్రామ పరిశుభ్రత, గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. మొదటి విడతలో భాగాచేశారని, రెండవ విడతలో కూడా ఇదే స్పూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

గ్రామస్తులందరు కలిసి గ్రామానికి అవసరమైన మౌళిక సదుపాయాలు గుర్తించి వాటి సాధనకు అవసరమైన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని అన్నారు. ◆ పల్లెల్లో పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు పల్లె ప్రగతి కార్య‌క్ర‌మాన్ని విజయవంతం చేయడంలో ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. ◆ గ్రామాభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయాల‌ని సూచించారు. పల్లె ప్రగతిని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలోనాటిన మొక్క‌ల‌ను సంర‌క్షించాల్సిన భాద్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. ◆ గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న బావులు, భావనలు కూల్చివేలని, ప్రతి గ్రామానికి ట్రాక్టర్ తో పాటు ట్రక్కు మరియు నీళ్ల ట్యాంకర్ లు కొని తీరాల్సిందేనన్నారు.

తడి, పొడి చేత్తను వేరు వేరుగా సేకరించాలని సూచించారు. ◆ గ్రామంలో నాటిన ప్రతి మొక్కకు tree guard లు ఏర్పాటు చేయాలిని సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామంలో వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న వారు గ్రామాభివృద్ధి కోసం ఎంతో కొంత వితరణ చేయాలని కోరారు. ◆ చెరువులు మరమత్తు పనులు ఉంటే తక్షణమే చేసుకుని వచ్చే వర్షాకాలం నాటికి నీరు నిలువ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ◆ గ్రామములో నర్సరీ, వైకుంఠధామం ఏర్పాట్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ◆ ఏ గ్రామంలో పల్లె ప్రగతి బాగా జరుగుతుందో ఆ గ్రామాలు దీర్ఘకాలిక అభివృద్ధి సాధిస్తాయన్నారు. ◆ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు, ZP CEO ప్రియాంక గారు, DRDA PD ఇందుమతి గారు, DPO శ్రీనివాస రావు, విద్యుత్ SE రమేష్ గారు, PR EE ప్రభాకర్, RWS EE పుష్పాలత, R&B EE శ్యామ్ ప్రసాద్ గారు, ఇతర జిల్లా అధికారులు, సర్పంచ్ లు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు తదితరులు ఉన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat