Home / ANDHRAPRADESH / హవ్వ.. ఈ గాజులు, ఉంగరాలు, పట్టీల చదివింపులేంటీ చంద్రబాబు..!

హవ్వ.. ఈ గాజులు, ఉంగరాలు, పట్టీల చదివింపులేంటీ చంద్రబాబు..!

ఏదైనా సమస్య వస్తే దాన్ని రాజకీయంగా అనుకులంగా మార్చుకుని క్యాష్ చేసుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. అధికారంలోకి రాగానే తన సామాజికవర్గానికి అను”కుల” మైన విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ఏపీ ప్రజల్లో అమరావతి సెంటిమెంట్ రగిలించారు. సింగపూర్ స్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను ఊహాలోకాల్లోకి తీసుకువెళ్లాడు..  రాజధానికి రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి మట్టి, నీళ్లు తీసుకువచ్చి ప్రజల్లో అమరావతి పట్ల భావోద్వేగాన్ని రేకిత్తించారు. రాజధాని నిర్మాణంలో మీరూ భాగంకండి అంటూ ఆన్‌లైన్‌లో అమరావతి ఇటుకలు అమ్మాడు..అంతే కాదు రాజధాని నిర్మాణం కోసం హుండీలు ఏర్పాటు చేయించి, విరాళాలు సేకరించాడు. బాబుగారితో పాటు ఎల్లోమీడియా కూడా అమరావతి సెంటిమెంట్ పండిస్తూ..భారీగా విరాళాలు సేకరించారు. ఇంతకీ ప్రజలు ఇచ్చిన కోట్లాది రూపాయల ఆ విరాళాలు ఏమయ్యాయో అటు బాబు చెప్పడు..ఇటు ఎల్లోమీడియా చెప్పదు.అది వేరే సంగతి.

.అయితే మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు మరోసారి అమరావతి సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని…అలాంటి రాజధానిని కాపాడుకోవాలంటూ  బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇక చంద్రబాబును నమ్మి విరాళాలు ఇచ్చాం..ఆ గాజులు, డబ్బులు తిరిగి ఇస్తారా అని ప్రజలు నిలదీస్తున్నారంటూ..చంద్రజ్యోతి పత్రికాధిపతి పచ్చపలుకులు పలుకుతున్నాడు. గత 20 రోజులుగా అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలకు చంద్రబాబు మద్దతు పలుకుతున్నాడు. అంతే కాదు..అమరావతి ఆందోళనల్లో తన సతీమణి భువనేశ్వరీని కూడా దింపి మరింత సెంటిమెంట్ పండించారు. రాజధాని రైతుల బాధలు చూసి భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులు అమరావతి జేఏసీకి విరాళం ఇచ్చారు. ఇంకేముంది మా బాబోరి సతీమణి అమరావతి రాజధానిని కాపాడుకోవడం కోసం ఉద్యమానికి చేయూతగా తన రెండు గాజులు ఇచ్చారహో అని ఎల్లోమీడియా వూదరగొట్టింది. బాబుగారి సతీమణి రెండు గాజుల విరాళంతో మళ్లీ బాబుగారు హుండీల రాజకీయం మొదలుపెట్టారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని నడిపించడానికి రోజూ వచ్చే రైతులకు, మహిళలకు, టీడీపీ కార్యకర్తలకు, నేతలకు టీ, కాఫీలు, టిఫినీలు, భోజనాలు, కోర్టుల్లో కేసులు గట్రా బోలెడు ఖర్చులుంటాయి కదా.. అందుకే చంద్రబాబు గారు నారాబాబా అవతారమెత్తారు.

తాజాగా విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని ఓ కల్యాణమండపంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేపట్టిన సేవ్ అమరావతి దీక్ష సందర్భంగా చంద్రబాబుగారు విరాళాల సేకరణకు నడుంబిగించారు. కాసేపు చదివింపుల పూజారి అయిపోయారంటే…నమ్మండి..నారాబాబా అవతారమెత్తిన బాబుగారు విరాళాల చదివింపులు ఎలా ఉన్నాయో మీరే చూడండి..కొంత మంది ఇక్కడకు వస్తూనే గొలుసుంటే..గొలుసు ఇచ్చిన వాళ్లు ఉన్నారు…గొలుసుల మీద గొలుసులు, గాజులు, దిద్దులు, పట్టీలు..ఇలా ఏమనుకుంటారో..ఇంట్లో వాళ్లు అడుగుతారో కూడా ఆలోచించలేదు..అంటూ మహిళలను ఆకాశానికి ఎత్తేసాడు. ఇదే సమయంలో మొన్న కూడా మీరు చూశారు..జనవరి 1 న నా మిసెస్ నాతో వచ్చింది..అమరావతి రైతుల బాధలు చూసింది..చూసిన తర్వాత ఏవైతే గాజులు ఉన్నాయో..అక్కడక్కడ తీసి డొనేట్ చేశారు అంటూ తన భార్య గొప్పతనాన్ని చెప్పుకున్నారు.

ఇక బాబుగారు చదివింపులు చూడండి..శాఖమూరి రవికాంత్ ఒక ఉంగరం ఇచ్చారు..వారిని కూడా అభినందిస్తున్నా..రత్నకుమారి ఒక ఉంగరం ఇచ్చారు..ఉషాకిరణ్ గారైతే ఒక ఉంగరం ఇచ్చారు..వారిని కూడా అభినందిస్తున్నా అని చదివింపుల కార్యక్రమాన్ని బాబుగారు పూజారిలా రక్తి కట్టించారు. పనిలో పనిగా రండమ్మా..రండి..మళ్లీ నేను రాజధాని కోసం చనిపోయిన వారి డెడ్ బాడీలు చూడాలి…ఆరు గంటల్లోపు పరామార్శించాలి అంటూ..చదివించేవాళ్లు రండమ్మా..అవతల నాకు ఇంకో కార్యక్రమం ఉంది అనే పూజారిలా బాబుగారు మహిళలను తొందరపెట్టారు.  ఇంకా చదివింపుల కార్యక్రమం అయిపోలేదు ఆగండి..ఇవేంటమ్మా..కాళ్లకు వేసుకునేవి కదమ్మా..పట్టీలు..కూడా ఈ ఉద్యమం కోసం త్యాగం చేశారు..దానం చేశారు..డబ్బులు కూడా రెండు వేల రూపాయలు క్యాష్ ఇచ్చారు..వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని నారాబాబాగారు దీవించేసారు. ఈ సందర్భంగా బాబుగారు మాట్లాడుతూ..రాజధాని కోసం ఉన్నపళంగా మొత్తం నిలువు దోపిడీ ఇచ్చేసారు..ఒంటిపై ఉన్న బంగారమంతా ఇచ్చేసారంటూ..సెలవిచ్చారు.ఈ స్ఫూర్తి రగలాలి..ఈ స్ఫూర్తి అంటుకోవాలి అంటూ..బాబుగారు బాబాలెవెల్లో ప్రవచించారు. అమరావతి కోసం బాబుగారు పడుతున్న పాట్లు కామెడీగా మారుతున్నాయి. గత ఐదేళ్లలో అమరావతిలో గ్రాఫిక్స్‌ కాకుండా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపడితే..ఇప్పుడు ఈ స్కిట్లు చేయాల్సిన అవసరం రాకపోయేది బాబుగారు..హవ్వ ఈ గాజులు, ఉంగరాలు, పట్టీల చదివింపులేంటీ చంద్రబాబు..మరీ మీ స్థాయికి కామెడీగా లేదు. అయినా బాబుగారంతే..సెంటిమెంట్ రంగరించి..జనాలకు ఆయిట్‌మెంట్ పూయడంలో ఆయన తర్వాతే ఎవరైనా..మనం చూస్తూ ఉండాల్సిందే..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat