Home / ANDHRAPRADESH / అంబటి రాంబాబు‌ను కెలికి మరీ పరువు పోగొట్టుకున్న నాగబాబు..!

అంబటి రాంబాబు‌ను కెలికి మరీ పరువు పోగొట్టుకున్న నాగబాబు..!

జనసేన నాయకుడు, నటుడు నాగబాబుకు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, బీజేపీతో కుదుర్చుకున్న పొత్తుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడమేంటే…కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. అంబటి విమర్శలపై పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని ఒక వ్యవస్థ గాని బాలన్స్ తప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళల్లో మోరల్ డౌన్ అయినట్లు…ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది…వాళ్ళ మోరల్ టోటల్ గా డౌన్ అయ్యిందన్న సంకేతాలు వెలువడుతున్నాయని నాగబాబు అన్నారు. అదిరింది ద్వారా నాకు జబర్దస్త్ లోటు తీరింది. అంబటి ,పేర్ని,అనిల్,అవంతి,మొదలైన లీడర్స్ వల్ల ఎక్స్ట్రా జబర్దస్ట్ లోటు తీరింది..ఇంకా అదిరింది కామెడీ షో పార్ట్ 2 అవసరం లేదేమో అనిపిస్తోందనంటూ.. నాగబాబు సెటైర్ వేశారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారి దుఃఖాన్ని చూడలేకపోతున్నా….మీ ఏక పాత్రాభినయం బహు ప్రశంసనీయం. నేను అంబటి గారి మీద జోక్ వెయ్యలేదు…ఆయన నిజంగానే ఒక మంచి నటుడు. ఈ తోకాలేని పిట్ట నటించిన సారీ సారీ.. ఈయన నటించిన తోకాలేని పిట్ట లో ఒక గొప్ప హవభావాలు ..అంటూ నాగబాబు తోకలేని పిట్ట మూవీలో నటించిన అంబటి రాంబాబు పిక్ పోస్ట్ చేశారు.

 

 

నాగబాబు విమర్శలకు అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగానే స్గ్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను ‘ తోకలేని పిట్ట’ చిత్రంలో నటించిన సంగతి నేనే మరచితిని …ధన్యవాదాలు నాగబాబు గారికి గుర్తుంచుకున్నందుకు .. నటనలో ఓటమిపాలై నిష్క్రమించాను నేను ..రాజకీయాలలో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా………..లేక’ అంటూ నాగబాబుపై అంబటి మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై కూడా ‘బహు పాత్రలలో బాగు బాగు’ అంటూ   ట్వీట్‌ చేస్తూ.. వివిధ సందర్భాల్లో చంద్రబాబు, మోదీ, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, మాయవతి, వెంకయ్యనాయుడులతో పవన్ కలిసి ఉన్న పిక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తనను తోకలేని పిట్ట అంటూ నాగబాబు చేసిన విమర్శలకు…అంబటి రాంబాబు ట్విట్టర్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా రాజకీయాల్లో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన అంబటి రాంబాబును కెలికి మరీ నాగబాబు పరువు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్..సోషల్ మీడియాలో హాట్‌‌టాపిక్‌గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat