బాహుబలి తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తి అయింది.
ఈ మూవీ జూలై ముప్పై తారీఖున విడుదల చేస్తామని చిత్రం యూనిట్ గతంలోనే తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవ్వుతుండటంతో విడుదల తేదీ మారుతుంది అని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటివరకు సమాచారం మేరకు అక్టోబర్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు జక్కన్న భావిస్తున్నాడు అని సమాచారం. ఆర్ఆర్ఆర్ లో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్, ఒలీవియా,అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్ నటిస్తున్నారు.