తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన.. తాను మాత్రం కారు గుర్తుకే ఓటు వేస్తాను. కేసీఆర్ నాకు పెద్ద కొడుకు అంటూ ఒక వృద్ధురాలు కేసీఆర్ పై.. టీఆర్ఎస్ పై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా వెల్లడించింది.
ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా ఉస్మానీయా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ క్రిష్ణన్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఏ ఇల్లు కట్టించినా నేను చేయి గుర్తుకు ఓటు వేయను. కారు గుర్తుకే ఓటు వేస్తా. ఎంతమంది చెప్పిన.. నా తలకోసిన సరే నేను కారు గుర్తుకే ఓటు వేస్తాను..
సీఎం కేసీఆర్ ఏమి చేస్తున్నాడు అని ఒక యువకుడు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ” నాకు నెలకు రెండు వేల రూపాయల ఫించన్ వస్తుంది. నెలకు ఆరు కిలోల బియ్యం వస్తున్నాయి. కేసీఆర్ నాకు పెద్దకొడుకు. ఎనబై రెండు ఏళ్ల మనిషిని నేను చెబుతున్నాను. నేను కారు గుర్తుకే ఓటు వేస్తా అని తేల్చి చెప్పింది.