Home / SLIDER / స్వచ్ భారత్ లో ” టి హెచ్ ఆర్ సిద్దిపేట టీమ్” అద్వితీయం…

స్వచ్ భారత్ లో ” టి హెచ్ ఆర్ సిద్దిపేట టీమ్” అద్వితీయం…

బెంగళూరు లో జరుగుతున్న స్వచ్ భారత్ మిషన్ ఎక్సపోసర్ 2020 లో మన సిద్దిపేట లో జరుగుతున్న స్వచ్ సిద్దిపేట ప్రోగ్రాం గురించి మంత్రి హరీష్ రావు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ తో చేస్తున్న కార్యక్రమాలు అనగా వేస్ట్ మానేజ్మెంట్, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సేగ్రిగేషన్, ప్లాస్టిక్ ఫ్రీ టౌన్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, స్వచ్ ఆరోగ్య సిద్ధిపేట కోసం fssai ద్వారా హోటల్స్ మరియు రోడ్ సైడ్ ఫుడ్ యజమానులకు, కార్మికులకు శిక్షణ వివరాలు తదితర అంశాలను సిద్దిపేట పట్టణ కౌన్సెలర్స్ ఇతర రాష్ట్రాల 10 మున్సిపాలిటీ ల ముందు తెలియజేయడం జరిగింది. అదే విదంగా రెండవ రోజు ఫీల్డ్ విజిట్స్ కు వెల్లి చాలా విషయాలను చూసి తెలుసుకున్నారు.
 
మూడవ రోజు కార్యక్రమంలో గ్రూప్ అక్టివిటీ లో బాగంగా… “జీరో వేస్ట్ ఫెస్టివల్” అనే అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చి రెండవ భహుమతి పొందారు. స్వచ్చత ప్లాస్టిక్ రహిత సిద్దిపేట లో బాగంగా ఇటీవల మంత్రి హరీష్ రావు గారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారూ అని..ప్లాస్టిక్ రహిత, పర్యావరణ సమతుల్యత ను కాపాడేందుకు మట్టి వినాయకులను ఏర్పాటు చేయడం..ఇంటింటికి మట్టి వినాయకులను పెట్టుకొనెల చొరవ చూపామని, అక్కడ బోజనాల్లో కూడా స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాస్ లు ఉండేవిధంగా చూసమని చెప్పారు.. ప్రజల్లో స్వచ్చ త పై, ప్లాస్టిక్ రహిత సిద్దిపేట చేయడం లో ఒక నమ్మకమ్ ఆత్మవిశ్వాసాన్నీ నింపాము అని చెప్పారు.. ఈ సందర్భంగా సిద్దిపేట మున్సిపాలిటీ కి ద్వితీయ బాహుమతి అందుకున్నారు. అయితే ఈ సందర్భంగా సిద్దిపేట లో హరీశ్ రావు గారి అభివృద్ధి , జరుగుతున్న వినూత్న కార్యక్రమాలను విన్న మిగతా మునిసిపాల్టీ లు ఈ సందర్భంగా అభినందించారు.. మేము కూడా సిద్దిపేట ను సందర్శిస్తాం అని చెప్పారు….
 
మంత్రి హరీష్ రావు గారి స్పూర్తి..వారి కృషి మేము ఎక్కడికి వెళ్లినా చెపుతుంటే మాలో ఒక ప్రజాప్రతినిధులుగా తృప్తినిచ్చింది అని..ఈ జన్మకు ఇంత కంటే గొప్ప మాకు ఏమి లేదు అని పట్టణ కౌన్సిలర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి మున్సిపాలిటీ లను టీమ్ లుగా విభజించారు ఆ టీమ్ కు పెరు పెట్టారన్నారు మన సిద్దిపేట టీమ్ కు “టి హెచ్ ఆర్ సిద్దిపేట్ టీమ్” అని పెట్టాం అని చెప్పారు.. వేరే మునిసిపాలిటీస్ లో చేస్తున్న మంచి కార్యక్రమాలను తెలుసుకొని, నేర్చుకొని రమ్మని మంత్రి హరీష్ రావు గారు మమ్మల్ని పంపారని మేము మూడు రోజుల్లో తెలుసుకున్న అంశాలను హరీష్ రావు గార్కి వివరిస్తాం అని చెప్పారు .. అత్తర్ పటేల్, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బర్ల మల్లి ఖార్జున్, కెమ్మసారం ప్రవీణ్, మోయీజ్, దీప్తి నాగరాజు పాల్గొన్నారు… ఆఖరి రోజు భహుమతి ప్రదానం కార్యక్రమం లో గ్యాదరి రవిందర్, చిప్ప ప్రభాకర్, బాసంగారి వెంకట్ లు కూడా పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat