పేకాట సామాన్యులకు కాదు సినీ ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టం ..కాస్త సమయం దొరికితే చాలు పేకాట ఆడుతూ టైం పాస్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కూడా ఆలా పేకాట ఆడుతూ కనిపించింది. ఇది కూడా సినిమా సెట్ లో.. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ సెట్ లో కాస్త సమయం దొరికినట్లు ఉంది..వెంటనే తన సన్నిహితుల తో కలిసి పేకాట మొదలుపెట్టింది. అందమైన హాఫ్ వైట్ లెహంగా ధరించి నవ వధువును తలపిస్తున్న కత్రిన భారీ ఆభరణాలు ధరించింది. వధువు గెటప్ లో మెహెందీ హైలైట్ గా కనిపిస్తోంది. షాట్ గ్యాప్ లో ఇలా తన బృందం తో కలిసి పేకాట ఆడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.