తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గాలి వీస్తుంది. ఇప్పటికే మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ యాబై మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించింది.
మిగతా వాటిలో కారు దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్లో ఏడుకు ఏడు వార్డులను టీఆర్ఎస్ గెలుపొందింది. మొత్తం పదమూడు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన వివరాలు ఇలా ఉన్నాయి.
1)10వ వార్డు కంటే నాగలక్ష్మి
2)13వ వార్డు అద్దంకి అనిల్
3)22వ వార్డు కొత్తూరు ఉమామహేస్వరరావు
4)16వ వార్డు దూదిపాళ్ల రాంబాబు
5)19వ వార్డు అమరవరపు విజయనిర్మల
6)7వ వార్డు మహమ్మద్ అనీస్
7)1వ వార్డు మారుతి సూరిబాబు