Home / SLIDER / టీచర్ హరీశ్..!

టీచర్ హరీశ్..!

అతనో ఉద్యమకారుడు,అతనో మంత్రి కానీ అంతకు మించి అతనో స్పూర్తివంతమైన వ్యక్తి..ఆదర్శవంతమైన వ్యక్తి..ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణా స్వరాష్ట్ర ఉద్యమంలో నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గౌ.శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమంలో ముందునడిచాడు..నాడు ఉద్యమంలో ఉద్యమకారులకు పెద్దన్నగా,కేసీఆర్ గారి పిలుపులతో కదులుతూ యువతలో,ఉద్యమకారుల్లో దైర్యాన్ని నింపుతూ వారికి అండగా ఉంటూ ముందుకు కదిలాడు..ఉద్యమకాలంలో,ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వచ్చిన పలు ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారి వ్యూహాలను అమలు చేస్తూ వ్యూహాల్లో దిట్టగా మారి విజయాలనందించి తెలంగాణా ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నాడు.. అనంతరం తెలంగాణా సాదన తొలి ప్రభుత్వంలో బారీ నీటిపారుదల శాఖా మంత్రి గా కేసీఆర్ గారి మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను కాలంతో పోటీపడి పరుగులు పెట్టించి వారి మార్గనిర్దేశనంలో ప్రాజెక్ట్ ను పూర్తికి కృషి చేసాడు..అనంతరం రెండవ సారి ప్రభుత్వంలో ఆర్థిక శాఖా మంత్రిగా తనకిచ్చిన బాద్యతలను విజవంతంగా నిర్వర్తిస్తున్నాడు..

తాజాగా మంత్రి హరీశ్ కొత్త బాద్యతతో ముందుకెలుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులకు దిశానిర్దేశనం,మోటివేషన్ చేస్తూ ”టీచర్ హరీశ్ రావు” గా మారాడు..ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు రావాలి,ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకం పెరగాలి,విద్యార్దులకు సరైన దిశ,దశ నిర్దేశనం చేయాలి అప్పుడు మంచి ఫలితాలు రాబట్టగలం అనే ఉద్దేశ్యంతో తన నియోజకవర్గమైన సిద్దిపేటలో విద్యపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు మంత్రి హరీశ్ రావు..నేరుగా పాఠశాలలకు వెల్తూ విద్యార్దులను స్వయంగా కలుస్తూ వారికి తన సందేశాలను అందిస్తున్నారు.ఎలాగైతే విద్యలో మనం విజయం సాదించగలం,ఉత్తమ ఫలితాలు రాబట్టగలమో విద్యార్దులకు అవగాహణ కల్పిస్తూ స్పూర్తి నింపే ప్రసంగాలు చేస్తున్నారు..వారికి అన్ని వసతులు అందుతున్నాయో లేదో ఆరాతిస్తూ వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు.. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్దులు ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెలుతున్నారు.విద్యార్దుల్లో చదువుతో పాటు నైపుణ్యం పెరిగేందుకు వీలుగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు..విద్యార్దుల్లో ఉత్సాహం నింపేందుకు వారి తల్లిదండ్రులకు స్వయంగా తన సందేశాన్ని సామాజిక మాద్యమాలు,ఉత్తరాల ద్వారా అందజేస్తు వారిలో చదవాలనే పట్టుదలను మరింత పెంచుతున్నారు..ఉత్తమ ప్రతిభ కనభరిచిన విద్యార్దులకు ప్రోత్సాహకాలు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు..ఈ రోజు సిద్దిపేట లోని ప్రతీ విద్యార్ది హరీశ్ రావు గారిని తమకు ఒక టీచర్ గా బావిస్తున్నారనటంలో అతిశయోక్తి లేదు..

మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికి రోజు అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికి ఒక సామాజిక బాద్యతగా విద్యార్దుల విజయం కోసం కృషి చేస్తున్నారు..ఉపాద్యాయులకు సలహాలు సూచనలు చేస్తూ విద్యార్దుల్లో నైపుణ్యాన్ని భయటకు తీసేందుకు ఆయన విశేష కృషి చేస్తున్నారు..ఇటివల కొందరితో సంబాషించినప్పుడు వారి నోటి నుండి వచ్చిన మాట ”హరీశన్న బెస్ట్ మినిస్టర్,అలాగే ఇప్పుడు బెస్ట్ టీచర్ ” లా మారి విద్యార్దుల్లో ఆలోచనను రేకెత్తిస్తూ వారి విజయానికి కారకుడవుతున్నాడని చర్చించుకుంటుంటే విన్నాను..నిజమే కదా..!! నాయకుడంటే అందరి బాగోగులు చూడటం సామాజిక బాద్యతలను నిర్వర్ధించడం అతనికి అందుకే ”ట్రబుల్ షూటర్” అని పేరు వచ్చింది..ఇలాంటి నాయకుడు దొరకటం సిద్దిపేట మరియూ తెలంగాణా ప్రజల అదృష్ఠమనే చెప్పాలి..ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్బుతంగా పనిచేస్తున్న మేలిమి బంగారం హరీశ్ రావు గారు..కేసీఆర్ గారి ఆలోచనలను అమలు చేస్తూ ముందుకు సాగుతూ ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తున్నారు..

(ఇటివల మంత్రి హరీశ్ రావు గారు విద్యార్దుల పట్ల తీసుకుంటున్న శ్రద్దను చూసి నా విశ్లేషణ)

*- Telangana Vijay
Warangal..*

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat