Home / ANDHRAPRADESH / బ్రేకింగ్.. ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఇక వరుస నోటిఫికేషన్లు..ఏఏ ఉద్యోగాలంటే..!

బ్రేకింగ్.. ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఇక వరుస నోటిఫికేషన్లు..ఏఏ ఉద్యోగాలంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లక్షన్నర గ్రామ సచివాలయ, వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ సర్కార్ తాజాగా ఏపీపీఎస్సీ కింద ఖాళీగా ఉన్న 63 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో చెప్పినట్లు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…‘‘మన ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి ప్రభుత్వ సేవలు అందించేందుకు చాలినంత మంది ఉద్యోగులు అవసరం. కానీ, ఇప్పుడు దాదాపు అన్ని శాఖల్లోనూ ఖాళీలున్నాయని తెలుస్తోంది. వీటిని సత్వరమే భర్తీచేసి ప్రజలకు సేవలందించాలి. ముఖ్యంగా విద్య, వైద్య శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉండడానికి వీల్లేదు’’ అని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా . విద్య, వైద్య శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ముందుగా భర్తీచేయాలని అధికారులు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

 

 

ఈ సందర్భంగా పోలీస్, రెవిన్యూ శాఖలతో పాటు,వివిధ ప్రభుత్వ విభాగాల్లో 63 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండొచ్చని అధికారులు సీఎం జగన్‌కు నివేదించినట్లు సమాచారం. వీటిలో టీచర్‌ పోస్టు లు 21 వేలు, ఏపీపీఎస్సీ భర్తీ చేసే పోస్టులు 19 వేలు, పోలీసు విభాగంలో పోస్టులు 13 వేలు ఉన్నాయి. అయితే, వాటి సంఖ్య మరింత పెరగొచ్చని సమాచారం. కాగా ఆర్థికశాఖ ప్రతి డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి ఖాళీలను నిర్ధారించి, వాటిని ఏవిధంగా భర్తీచేయాలన్న విషయంపై నియామక సంస్థ(ఏజన్సీ)లతో చర్చించిన అనంతరం నోటిఫికేషన్లకై ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇక ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితి సడలించే విషయం కూడా ఈ సమీక్షలో ఏపీపీఎస్సీ ప్రస్తావించింది. అయితే 46 సంవత్సరాలకు సడలించాలన్న అభిప్రాయం వ్యక్తమైనా.. ఏయే పోస్టులకు సడలించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 21న జరిగే సమావేశంలో వయోపరిమితి సడలింపుపై నిర్ణయంతీసుకోనున్నారు. కాగా, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టులు 63 వేలకుపైనే ఉండొచ్చని సీఎం జగన్‌కు అధికారులు నివేదించారు. మొత్తంగా 63 వేలకు పైగా ఉద్యోగాలను ప్రాధాన్యతాక్రమంలో భర్తీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే వివిధ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది..సో..ఇంకెందుకు ఆలస్యం..ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టండి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat