Home / ANDHRAPRADESH / పార్లమెంట్‌లో ఘోర అవమానం… తలదించుకున్న టీడీపీ ఎంపీలు..!

పార్లమెంట్‌లో ఘోర అవమానం… తలదించుకున్న టీడీపీ ఎంపీలు..!

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లోనే తొలి రోజునే టీడీపీకి ఘోర పరాభావం ఎదురైంది. పార్లమెంట్‌లో టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని మెడబట్టి గెంటేసినంత పని చేశారు. అయితే టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని గెంటేసి…అదే గదిని వైసీపీకి కేటాయించడం విశేషం..పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో తొలి రోజునే చోటు చేసుకున్న ఈ ఘటనతో టీడీపీ ఎంపీలు కుతకుతలాడిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…2019 లోక్‌సభ ఎన్నికలలో వైసీపీ 22 ఎంపీ సీట్లను గెల్చుకోగా టీడీపీ మూడు ఎంపీ స్థానాలకు పరిమితమైంది. కాగా పార్లమెంట్‌లో తమ కార్యాలయం కోసం వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేయగా..ఆయన గ్రౌండ్‌‌ఫ్లోర్‌లోని 5 నెంబర్ గదిని కేటాయించారు. అయితే ఆ గదిలో 30 ఏళ్లుగా టీడీపీ కార్యాలయం కొనసాగుతోంది. సరైన సంఖ్యలో ఎంపీలు లేనప్పటికీ చంద్రబాబు మేనేజ్‌మెంట్‌తో టీడీపీ సభ్యులు ఆ గదిలోనే తిష్ట వేశారు. ఈ నేఫథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు గెలిచారు..కాబట్టి 5 వ నెంబర్ గదిని వారికే కేటాయిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తక్షణమే ఆ గది నుంచి టీడీపీ ఎంపీలను ఖాళీ చేయమని ఆర్డరేసింది. అలాగే టీడీపీ సభ్యులకు థర్డ్ ఫ్లోర్‌లోని 118 నెంబర్‌ గది కేటాయించారు.

అయితే మూడు నెలల కిందటే 5 వ నెంబర్ గదిని వైసీపీకి కేటాయించినా..కావాలనే టీడీపీ దానిని ఖాళీ చేయలేదు..దీంతో కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి గది లేక వైసీపీ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ వైఖరిపై ఆగ్రహించిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంపై మరోసారి స్పీకర్ ఓం బిర్లాను కలవడంతో ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే స్పీకర్ ఆదేశాలతో పార్లమెంట్ సిబ్బంది గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 5 వ నెంబర్ గదికి ఉన్న టీడీపీ నేమ్ బోర్డును పీకేసి, వైసీపీ నేమ్ బోర్డును తగిలించారు. దీంతో అవమానభారంతో టీడీపీ ఆ గదిని వదలక తప్పలేదు. కాగా టీడీపీని బయటకు గెంటేసి…వైసీపీకి కేటాయించిన 5 వ నెంబర్ గది ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాల గదులకు అతి సమీపంలో ఉన్నదంట..అందుకే ఎక్కడ వైసీపీ ఎంపీలు మోదీ, అమిత్‌షాలతో టచ్‌లో ఉంటారనే భయంతో థర్డ్ ఫ్లోర్‌కు వెళ్లకుండా అదే గదిలో టీడీపీ తిష్టవేసింది. ఆ‌‌ఖరకు స్పీకర్ బోర్డు పీకించడంతో తీవ్ర అవమానంతో థర్డ్ ఫ్లోర్‌కు వెళ్లాల్సి వచ్చింది. మొత్తంగా శాసనమండలి రద్దు నేపథ్యంలో మోదీ, షాలు వచ్చిపోయేది చూసి సీఎం జగన్‌పై, వైసీపీపై ఫిర్యాదులు చేయాలని భావించిన టీడీపీ ఎంపీలు…బోర్డు పీకేయడంతో ఉన్న పరువు కాస్తాపోగొట్టుకుని తలదించుకోవాల్సి వచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat