Home / ANDHRAPRADESH / బాలయ్య, పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

బాలయ్య, పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మలు తగలేస్తూ… తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను వైసీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు అడ్డుకుని సీమద్రోహి బాలయ్య గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ ఘటనపై మరుసటి రోజు మీడియాత మాట్లాడిన బాలయ్య మావాళ్లు 200 మంది ఉన్నారు.. తాను సైగ చేస్తే ఏమయ్యేది..నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాలయ్య వ్యాఖ్యలపై బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. ఏపీ ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారని చెప్పిన ఆయన…హిందూపురంలో వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్‌ ఇచ్చే సీన్ బాలయ్యకు లేదని కొట్టిపడేసారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంవల్లే ఏపీకి కేంద్రం నిధులు కేటాయించలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ సురేష్ కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి సామాన్యుల చేతిలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు..మూడు రాజధానులకు మద్దతునిచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ను ప్రస్తావిస్తూ…పవన్ కల్యాణ్ ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. వచ్చే నాలుగేళ్లలో జనసేన పార్టీ ఉండదని..పవన్ బీజేపీలో పూర్తిగా విలీనం చేస్తారని విమర్శించారు. ఇక ఏపీ శాసనమండలి రద్దు ఆలస్యం అవుతుందేమో కాని..కాని కచ్చితంగా కౌన్సిల్ రద్దవడం ఖాయమని ఎంపీ సురేష్ స్పష్టం చేశారు. మొత్తంగా బాలయ్య, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat