Home / ANDHRAPRADESH / టీడీపీ కులపార్టీ అయిందంటే.. మీ తండ్రీకొడుకుల పుణ్యమే లోకేషూ..!

టీడీపీ కులపార్టీ అయిందంటే.. మీ తండ్రీకొడుకుల పుణ్యమే లోకేషూ..!

స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరుపొందింది. నిజంగా ఎన్టీఆర్ హయాంలో బీసీల్లో రాజకీయ చైతన్యం కలిగించింది టీడీపీ పార్టీనే…మోత్కుపల్లి,  జీఎంసీ బాలయోగి,  ప్రతిబాభారతి, పుష్పరాజ్ వంటి దళితనేతలు రాజకీయంగా ఎదిగారంటే అది ఎన్టీఆర్ పుణ్యమే.. అందుకే  టీడీపీకి దళిత, బడుగు, బలహీనవర్గాలు అండగా నిలిచాయి. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నాడో…అప్పటి నుంచి టీడీపీ దళితులకు,  బడుగులకు దూరమవుతూ వస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పడుు తన కమ్మ సామాజికవర్గానికి పెద్ద పీట వేశాడు. రాజకీయ పదవుల దగ్గర నుంచి ప్రభుత్వ శాఖల వరకు తన సామాజికవర్గానికే పెద్ద పీట వేశాడు. ఒకప్పుడు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు రాజకీయంగా అణకదొక్కబడ్డారు. బాబు చుట్టూ కుల కోటరీ మొదలైంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పార్టీలో చంద్రబాబు సామాజికవర్గం ఆధిపత్యానికి అడ్డే లేకుండా పోయింది. కేవలం తన సామాజికవర్గం బలంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేశారు. దీంతో అమరావతి ఏపీ ప్రజల కలల రాజధాని కాదు….చంద్రబాబు తన కులం కోసం కట్టుకున్న కులరాజధాని అని ఆయన సహచరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గత ఎన్నికలకు ముందు ఆరోపించారు.

ఇక అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ముందే డిసైడ్ చేసుకున్న చంద్రబాబు.. తన కులానికి చెందిన నేతలు, పారిశ్రామికవేత్తలకు బినామీల పేరుతో వేలాది ఎకరాలు కారుచౌకగా కట్టిపెట్టాడు. ప్రభుత్వ కార్యాలయాలకు ఎకరం కోట్లాది రూపాయలకు భూములు కేటాయించిన చంద్రబాబు..అదే తన సామాజికవర్గానికి చెందినవారికి ఎకరం లక్షల్లో అది కూడా అతి తక్కువ రేటుకు రైతుల భూములను దోచిపెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు తన కులంపై ఉన్న పిచ్చి…ఇతర కులాలపై ఉన్న ద్వేషాన్ని చాలా సార్లు బహిరంగంగానే వెళ్లగక్కాడు..ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ…చంద్రబాబు తనలోని అగ్రకుల దురంహాకారాన్ని డైరెక్ట్‌గా బయటపెట్టుకున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు సామాజికవర్గం పెత్తనం భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పారు.  కేవలం చంద్రబాబు కుల పెత్తనాన్ని తట్టుకోలేక ..మిగతా కులాలన్నీ ఏకమై టీడీపీని ఓడించారని బాబుభక్తుడైన చంద్రజ్యోతి సంపాదకుడు తన కొత్తపలుకులో వాపోయాడు కూడా…

ఇప్పుడు ఏపీలో జగన్ సర్కార్ మూడు రాజధానులు ఏర్పాటుకు ముందడుగు వేస్తుంటే..చంద్రబాబు తన సామాజికవర్గం కోసం కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఏపీలో గత 50 రోజులుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత గ్రామాల్లోని రైతులు ఆందోళనలు చేస్తున్నారు ప్రధానంగా మందడం, తుళ్లూరు, వెలగపూడి వంటి గ్రామాల్లో ఆందోళన చేస్తున్న వారిలో 80 శాతం చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే..అందుకే ఇప్పటికే చంద్రబాబు సామాజికవర్గ పెత్తనంపై ఆగ్రహంతో ఉన్న ఇతర వర్గాలు అమరావతి ఆందోళనలకు పెద్దగా మద్దతు పలకడం లేదు. దీంతో అమరావతి ఉద్యమం కాస్తా..చంద్రబాబు సామాజికవర్గం చేస్తున్న ఆందోళనగా ముద్రపడింది. టీడీపీ అంటే ఒక కులం పార్టీ అన్న అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో నెలకోంది. దీనికి ముమ్మాటికి కారణం చంద్రబాబు, లోకేషులే.

 

అయితే తాజాగా లోకేష్ మాత్రం కులం గురించి తనదైన స్టైల్లో స్పందించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని కులం ఏమిటని అడుగుతున్నారని తప్పు పట్టారు. అరెస్టు అయిన ఉద్యమకారుల కులం గురించి అడుగుతున్నారని లోకేష్ వాపోయారు. అలా అడిగే వారికి తమది ఆంధ్రప్రదేశ్ కులమని చెప్పాలని లోకేష్ పేర్కొన్నాడు. లోకేష్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.. మీ తాత స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని బడుగుల పార్టీగా తీర్చిదిద్దితే…మీ తండ్రీకొడుకులు కలిసి..టీడీపీ అంటే ఒక కులపార్టీగా మార్చేశారు…ఇప్పుడు టీడీపీ ఒక కులపార్టీ అయిందంటే..దానికి కారణం మీరే…మీకున్న కులపిచ్చితో, కుల మీడియాను అడ్డుపెట్టుకుని ఇతరకులాలను పార్టీకి దూరం చేశారంటూ సగటు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు, లోకేష్‌లపై మండిపడుతున్నారు..మొత్తంగా కులంపై లోకేష్ తెలివిగా కామెంట్ చేశానని అనుకుని…అడ్డంగా బుక్కైపోయాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat