Home / TELANGANA / ఐటీ మినిస్టర్‌ కేటీఆర్ ఫోటో వైరల్..!!

ఐటీ మినిస్టర్‌ కేటీఆర్ ఫోటో వైరల్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒకవైపు అధికారక పర్యటనలతో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా మరి ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారనే సంగతి విదితమే. ట్విట్టర్లో ఎవరైన తమ సమస్యను.. బాధను విన్నవించుకుంటే క్షణాల్లో స్పందించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారు మంత్రి కేటీఆర్ . అంతేకాకుండా మంత్రి కేటీఆర్ సమకాలిన విషయాలపై కూడా స్పందిస్తారు.

తాజాగా ఆయన తొలిసారిగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న జ్ఞాపకాన్ని తలచుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోను పోస్టు చేశారు. ఆ ఫోటోలో మంత్రి కేటీఆర్ ‘ప్రేమదేశం’ మూవీ హీరో వినీత్ లెక్క కనిపిస్తున్నారు. హెయిర్ స్టైల్ అచ్చం అలాగే ఉంది. ఆ మూవీ 1996లో రిలీజయ్యింది. బహుశా ఆ ట్రెండ్‌ ఫాలోయ్యే ఉంటారు మంత్రి కేటీఆర్. ఈ ఫోటోను మంత్రి కేటీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat