Home / ANDHRAPRADESH / టీడీపీకి షాక్…మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీకి షాక్…మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం..కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందే తప్పా…రాజధాని ఎక్కడా అనే విషయంలో జోక్యం చేసుకోదని పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిరంజన్ రాయ్‌ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణలు అమరావతి నుంచి అంగుళం కూడా రాజధానిని కదల్చలేరు…కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుంది అని వాదిస్తుంటే.. మూడు రాజధానుల అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పదే పదే క్లారిటీ ఇస్తున్నారు.

 

తాజాగా మరో బీజేపీ ఎంపీ టీజీవెంకటేష్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడు రాజధానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దేశ రెండో రాజధానిగా హైదరాబాదు కంటే అమరావతే బెటరని, రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే బాగుంటుందని టీజీ వెంకటేశ్‌ అన్నారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ తీసుకువచ్చిన పరిపాలన వికేద్రీకరణకు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి కేంద్రం ఒప్పుకుందంటే..రాజధాని విభజనకు పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా?! అని టీజీ వెంకటేష్ అన్నారు.

 

రాష్ట్రం విడిపోయాక 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ విభాగాలను 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు చెప్పినా పట్టించుకోలేదని, మాట్లాడవద్దని వార్నింగ్‌ ఇవ్వడంతో ఎవరూ నోరు విప్పలేకపోయామని టీజీ సంచలన విషయాలను బయటపెట్టారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటన ఇస్తే తాను సపోర్టు చేశానని, అప్పుడు కూడా తనకు చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారని తెలిపారు. ఏపీ బీజేపీలో జగన్‌కు వ్యతిరేకం, అనుకూలం అంటూ వర్గాలేమీ లేవని తేల్చి చెప్పారు.

 

కాగా ఏపీలో మూడు రాజధానులకు కేంద్రం పరోక్షంగా పచ్చ జెండా ఊపిందంటూ…బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. నిన్నటివరకు బీజేపీలో చంద్రబాబు అనుకుల వర్గం అంతా అమరావతికి అనుకూలంగా పోరాడుతుంది. ఒక్క జీవిఎల్ తప్పా..మిగతా నేతలంతా గోడమీద పిల్లిలా ఉన్నారు. అయితే పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖమంత్రి రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిది..మేం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తామనే స్పష్టం చేయడంతో మెల్లగా ఏపీ బీజేపీ నేతలంతా వికేంద్రీకరణకు జై కొడుతున్నారు. మొత్తంగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోదని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. మరి టీజీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat