Home / ANDHRAPRADESH / ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ

ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ

ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుండి విజయవాడ వైపు వెళ్ళుతున్న హెచ్ పి గ్యాస్ ట్యాంకర్ నుండి గ్యాస్ లీకవుతున్న సంఘటనతో ఎటువంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పూర్తి స్థాయిలో రాకపోకలు స్థంభించాయి. స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనలో ఉన్నారు. వేరే గ్యాస్ టాంకర్ డ్రైవర్ సాహసోపేతంగా గ్యాస్ లీకవుతున్న ట్యాంకర్ కు పడిన రంధ్రంలో చెక్క ముక్కను పెట్టడంతో తాత్కాలికంగా లీకేజీ ఆగింది . ఈ గ్యాస్ కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది వాటర్ వెదజల్లుతున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat