Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్… బయటకు వచ్చిన ఐటీ శాఖ పూర్తి స్థాయి పంచనామా పత్రం.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..!

బిగ్ బ్రేకింగ్… బయటకు వచ్చిన ఐటీ శాఖ పూర్తి స్థాయి పంచనామా పత్రం.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..!

ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం. హవాలా, మనీలాండరింగ్ వ్యవహారాలు బయటపడ్డాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఐటీ శాఖ పంచనామాలోని ఒక పేజీని మాత్రమే కోట్ చేస్తూ పీఎస్ శ్రీనివాస్ దగ్గర దొరికింది…2 లక్షలు…కొద్ది బంగారు నగలే..ఐటీ అధికారులు ఆయన్ని విచారించి పంపించివేశారు..వైసీపీ నేతలు కావాలనే 2 వేల కోట్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బుకాయించడం మొదలు పెట్టారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే ఐటీ శాఖ పంచనామాలో దొరి్కింది 2 లక్షలే ..ఇందులో అనవసరంగా చంద్రబాబును ఇరికిస్తున్నారంటూ పచ్చ కథనాలు వండివార్చాయి. కాగా ఒకసారి ఐటీ శాఖ రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌ను పూర్తిగా చదువుకోండి..అందులో దొరికిన 2 లక్షల క్యాష్‌తో పాటు వందలాది డాక్యుమెంట్లు, లాకర్లు కూడా సీజ్ చేశారు..ఒక్కో డాక్యుమెంట్‌లో వేల కోట్ల అవినీతి లావాదేవీలు ఉన్నాయని ఐటీశాఖ అధికారులు తెలిపారంటూ.. వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

 

అయితే ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబుకు కానీ, ఆయన పీఎస్ కు గానీ సంబంధం లేదని టీడీపీ వాదిస్తున్న తరుణంలో.. ఐటీశాఖకు సంబంధించిన పూర్తి స్థాయి పంచనామా పత్రం బయటికొచ్చింది. కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాలో జరిగిన సోదాలపై ఐటీ శాఖ రూపొందించిన 13 పేజీల పంచనామా బయటకు వచ్చింది. ఈ 13 పేజీల పంచనామాలో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆర్కే ఇన్‌ఫ్రాలో మొత్తం 1000 పేజీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ తన పంచనామాలో తెలిపింది. అలాగే బ్యాంకు లాకర్ల సీజ్ వివరాలను కూడా ఈ పంచనామాలో పొందుపరిచింది. గత వారం శ్రీనివాస్ ఇంట్లో భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం చేసుకున్నట్టు పంచనామాలో అధికారులు పేర్కొన్నారు. ఒక్కో డాక్యుమెంట్‌లో కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు కొన్ని విలువైన పత్రాలను కూడా సీజ్ చేసినట్టు ఈ పంచనామా పత్రంలో ఐటీ శాఖ పేర్కొంది. దీన్ని బట్టి…టీడీపీ నేతలు వాదిస్తున్నట్లు చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీ దాడుల్లో దొరికింది..2.63 లక్షలో, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు 2000 వేల కోట్లోకాదు…మొత్తం 1000 డాక్యుమెంట్లు దొరికాయి..ఒక్కో డాక్యుమెంట్లో వేలాది కోట్ల అక్రమలావాదేవీలు ఉన్నాయన్న విషయం ఐటీ శాఖ విడుదల చేసిన 13 పేజీల పంచనామా పత్రంలో బయటపడింది. మొత్తంగా చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల నేపథ్యంలో  2 వేల కోట్లకు మించి వేలాది కోట్ల అవినీతి బాగోతం ఉందని రూఢీ అయింది..దీంతో కేవలం 2.63 లక్షలే అంటూ బుకాయిస్తున్న టీడీపీ నేతల నోట్లో వెలక్కాయపడ్డట్లైంది. ఈ 13 పేజీల పూర్తి స్థాయి పంచనామాతో  వేల కోట్ల అవినీతి బాగోతంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ  పంచనామా పత్రంపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat