Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..అమిత్‌షా దెబ్బకు షాకైన టీడీపీ ఎమ్మెల్సీలు…!

బ్రేకింగ్..అమిత్‌షా దెబ్బకు షాకైన టీడీపీ ఎమ్మెల్సీలు…!

ఏపీ శాసనమండలి రద్దుపై హస్తిన వేదికగా రాజకీయాలు షురూ అయ్యాయి. రీసెంట్‌గా సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో భేటీ అయి..శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. జగన్‌తో చర్చలు జరిగిన అనంతరం మోదీసహా కేంద్రమంత్రులు మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుకు దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది.. మార్చిలో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మండలి రద్దును అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు హస్తిన వేదికగా పావులు కదుపుతున్నాడు. ముందుగా తనకు ఆప్తుడైన వెంకయ్యనాయుడితో పాటు, అమిత్‌షాతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్సీలను పంపించాలని నిర్ణయించాడు.

 

అయితే ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఊహించని షాక్‌ ఇచ్చారు. శాసనమండలి రద్దుపై చంద్రబాబు చేస్తున్న కుటిల యత్నాలను గ్రహించిన అమిత్‌షా టీడీపీ ఎమ్మెల్సీలకు అపాయింట్‌మెంట్‌ ఇ‍వ్వడానికి నిరాకరించారు. అయినా ఇప్పటికే శాసనమండలి రద్దు, వికేంద్రీకరణపై రాజకీయాలకు తావు ఇవ్వకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తుంది. అందుకే మండలి రద్దుపై రాజకీయం చేయాలని చూసున్న టీడీపీ ఎమ్మెల్సీలను కలిసేందుకు అమిత్‌షా నో చెప్పారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్‌మెంట్ మాత్రమే ఖరారైంది. వెంకయ్యనాయుడితో తమ వ్యథ చెప్పుకున్నా పెద్ద ఫలితం లేదని భావించిన టీడీపీ ఎమ్మెల్సీలు ఇక చేసేదేమీలేక ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మొత్తంగా శాసనమండలి రద్దుపై రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబుకు, టీడీపీ ఎమ్మెల్సీలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా షాక్ ఇచ్చారు. నిన్నటి దాకా సీఎం జగన్‌‌ అపాయింట్‌మెంట్ అడిగితే మోదీ, షాలు చివాట్లేసి వెళ్లగొట్టారని పండుగ చేసుకున్న ఎల్లోమీడియా…ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీలకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ నిరాకరించడంతో తేలుకుట్టిన దొంగలా గప్‌చుప్ అయింది. మొత్తానికి అమిత్‌షా దెబ్బకు చంద్రబాబుతో సహా, టీడీపీ ఎమ్మెల్సీల మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat