మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈరోజు ఎంతో ఆనందకరమైన విషయమని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పుట్టినరోజు. ఈమె జన్మదినం సందర్భంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న రాంచరణ్ ఆమెకు విషెస్ తెలిపి పుష్పగుచ్ఛాలను అందజేశారు. భార్య ఉపాసనతో కలిసి అమ్మతో ఇంట్లోనే ఉండి సరదాగా కాసేపు గడిపారు. అయితే తన తల్లితో గడిపిన ఆ మదుర క్షణాలను ఫోటోలు రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.