Home / ANDHRAPRADESH / ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఫ్యూచర్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!

ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఫ్యూచర్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో ప్రకంపనలు రేపుతున్న 2 వేల కోట్ల స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు ఉచ్చు మరింతగా బిగుసుపోయిందని, ఇక తప్పించుకునే ఛాన్సే లేదని.. ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి రద్దుపై ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి…వైసీపీ సర్కార్‌పై ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో మంత్రి కొడాలి నాని కూడా ఢిల్లీలో పర్యటిస్తూ..కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు పలువురు కేంద్ర నేతలను కలిసారు. ఈ సందర్భంగా 2 వేల కోట్ల స్కామ్‌పై మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ఫ్యూచర్ జైలే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఐటీ దాడుల్లో పట్టుపడిన రూ.2వేల అక్రమ ఆస్తుల కేసులో చంద్రబాబును కాపాడుకునేందుకు ఢిల్లీ కేంద్రంగా టీడీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అయితే పచ్చిగా దొరికిపోయిన పచ్చదొంగకు సాయం చేసేందుకు ఇక్కడెవరూ ముందుకు రావడంలేదని, ఎద్దేవా చేశారు. ఇక మాజీ పీఏ ఇంట్లో రూ.2లక్షలు దొరికితే, దాన్ని రూ.2వేల కోట్లుగా వైసీపీ ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు.. నిజమే, బుద్ధి ఉన్న ఏ సన్నాసి కూడా ఇంట్లో రూ.2వేల కోట్లు దాచుకోడు…. అలా చెయ్యడానికి చంద్రబాబు పిచ్చోడేమీకాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ లో సూట్ కేసులు చూపించి, ఇందులో అంత డబ్బు పడుతుందా? అని టీడీపీ నేతలు అడుగుతుండటం చాలా కామెడీగా ఉందని, అసలు ఘరానా ఆర్థిక నేరగాళ్లు సూట్‌కేసుల్లో డబ్బులు పెట్టుకుంటారా అంటూ వెటకారం చేశారు.

మాజీ సీఎం చంద్రబాబు అక్రమ సంపాదనలో ఈ రూ.2వేల కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్… వాటికి సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్ల వివరాలతోపాటు చంద్రబాబు చెప్పిన మేరకు ఎవరెంత డబ్బులు ఇచ్చింది మాజీ పీఏ శ్రీనివాస్ తన డైరీలో డీటైల్డ్‌గా రాసుకున్నారని..ఈ డైరీలపై విచారణ జరుగుతుందని… బాబు ఫ్యూచర్ కచ్చితంగా జైలే.. చేసిన అక్రమాలకు ఆయన శిక్ష అనుభవించక తప్పదు అంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా 2 వేల కోట్ల స్కామ్‌‌ నుంచి చంద్రబాబు తప్పించుకునే ఛాన్సే లేదని, జైలుకు పోవడం ఖాయమని ఢిల్లీ వేదికగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి నాని వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat