Home / ANDHRAPRADESH / బాలయ్య పేరు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..ఇవిగో సాక్ష్యాలు..!

బాలయ్య పేరు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..ఇవిగో సాక్ష్యాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన కామెడీ ప్రహసనంగా తయారైంది. ఐటీ దాడుల నేపథ్యంలో కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో ఆస్తుల ప్రకటన డ్రామా ఆడబోయి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. 2018–19 ఏడాదికి గాను ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్‌కు తన తాత 26,440 హెరిటేజ్‌ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్‌ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన లేదు. అయితే ఇక్కడ ప్రకటిస్తున్నది. తమ కుటుంబ ఆస్తులు కాబట్టి తాతంటే చంద్రబాబే అని పేర్కొంటూ న్యూస్‌ వెబ్‌సైట్లన్నీ రాశాయి. దీంతో గత 9 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నా ఏ ఏడాది హెరిటేజ్ షేర్లు చూపించని చంద్రబాబు ఈ సారి మాత్రం 26,440 హెరిటేజ్‌ షేర్లను గిఫ్ట్‌గా ఎలా ఇస్తాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే తమపచ్చ పత్రికలను ఈ తప్పు సరిదిద్దమంటూ పురమాయించారు. తెల్లారేసరికి తమ అనుకుల పత్రికలన్నింటిలో తాత బాలకృష్ణ ఈ షేర్లను దేవాన్ష్‌కు బహుమానంగా ఇచ్చారంటూ రాయించారు. తాత పేరు విషయంలో తడబడ్డ చంద్రబాబు అండ్‌ కో.. దీన్ని సరిదిద్దుకునే క్రమంలో బాలయ్య పేరు చెప్పి మరోసారి అడ్డంగా దొరికిపోయారు.

అసలు 2019 మార్చి 22న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో బాలకృష్ణ తన పేరుమీద హెరిటేజ్‌ షేర్లు ఉన్న విషయాన్నే పేర్కొనలేదు. అయినా అది మరిచిపోయి, తాతంటే చంద్రబాబు కాదు.. బాలయ్య అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. 2019 అఫిడవిట్‌లో బాలకృష్ణ తన వద్ద మొత్తం 5 కంపెనీలకు సంబంధించి మొత్తం రూ.31.28 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు మాత్రమే తెలిపారు. ఎక్కడా హెరిటేజ్‌ ఫుడ్‌ షేర్లు ఉన్నట్లు ప్రకటించలేదు. మరి తన దగ్గర లేని షేర్లను బాలకృష్ణ ఇప్పుడు మనవడు దేవాన్స్‌కు ఎలా ఇచ్చాడో లోకేశే చెప్పాలి. ఆస్తుల ప్రకటన చేసినప్పుడు కూడా లోకేష్ దేవాన్ష్ పేరుతో షేర్లు ఉన్నాయని వాటిని తాత గిఫ్ట్‌గా ఇచ్చాడు కానీ బాలయ్య పేరు ఎక్కడా చెప్పలేదు.

 

ఇక.దేవాన్ష్ పేరిట 2017–18లో హెరిటేజ్‌ షేర్లు లేవు. అంటే 2018–19లోనే హెరిటేజ్‌ షేర్లు దేవాన్ష్ పేరిట బదిలీ అయ్యి ఉండాలి. దేవాన్ష్ నాయనమ్మ భువనేశ్వరి కంపెనీ ఎండీ, తల్లి బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.. ఇలా ప్రమోటర్లకు రక్త సంబంధీకుడైన దేవాన్ష్ పేరిట ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువైన 26,440 షేర్లు బదలాయింపు జరిగితే అది తప్పకుండా స్టాక్‌ ఎక్స్చేంజ్‌కి తెలియజేయాల్సిందేనని కంపెనీ సెక్రటరీలు స్పష్టం చేస్తున్నారు. 2018–19 ఆర్థిక ఏడాదికి స్టాక్‌ ఎక్స్చేంజ్‌ని పరిశీలిస్తే మనవడి పేరిట షేర్లు వచ్చినట్లు భువనేశ్వరి కానీ, కొడుకు పేరిట షేర్లు వచ్చినట్లు లోకేశ్‌ కానీ ఎక్కడా పేర్కొనలేదు. ఇది కచ్చితంగా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నిబంధనలు ఉల్లంఘించడం కిందకే వస్తుంది. ఇలా ఒక వ్యక్తి పేరు మీద ఉన్న షేర్లు స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ప్రమేయం లేకుండా మరో వ్యక్తికి ఎలా బదలాయిస్తారో, ఆ మాయ ఏంటో స్టాక్‌ మార్కెట్లో తలపండిన వాళ్లకు కూడా మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో గ్యాంగ్‌ ఇంకో కొత్త డ్రామాకు తెరతీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తంగా తమకు ఆస్తులేవని చెప్పుకోవడానికి ముక్కుపచ్చలారని పసిపిల్లాడిని కూడా లాగిన దౌర్భాగ్యం నారాఫ్యామిలీకే దక్కింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat