Home / ANDHRAPRADESH / ఇంటి దొంగల పని పడుతున్న బీజేపీ అధిష్టానం..!

ఇంటి దొంగల పని పడుతున్న బీజేపీ అధిష్టానం..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. మరోవైపు కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అలా మోదీ రెండోసారి పీఎం అయ్యారో లేదో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కనకమేడల రవీంద్రకుమార్ అకస్మాత్తుగా బీజేపీలో చేరారు. అంతే కాదు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని పూర్తిగా బీజేపీలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. టీడీపీ ఎంపీల విలీనం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు రాహుల్, సోనియాలతో కలిసి దేశమంతటా తిరుగుతూ.. మోదీని దించేస్తా అని తొడకొట్టిన చంద్రబాబు గత ఐదేళ్లలో చేసిన అవినీతిపై మోదీ సర్కార్ ఎక్కడ కేసులు పెట్టి జైలుకు పంపిస్తుందో అన్న భయంతోనే తన నలుగురు రాజ్యసభ ఎంపీలను వెంకయ్యనాయుడి సహాయంతో బీజేపీలోకి పంపించినట్లు అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతే కాదు ఆ నలుగురు ఎంపీలలో సుజనా చౌదరి 6 వేల కోట్ల హవాలా, మనీ ల్యాండరింగ్ స్కామ్‌లో కేసులు ఎదురుకుంటున్నారు. ఇక పక్కా వ్యాపారవేత్తలైన మరో ఇద్దరు ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్‌లు కూడా రాజకీయంగా, ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చంద్రబాబుకు ఆర్థికంగా సహకరిస్తూ అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ఈ ముగ్గురు ఎంపీలు..టీడీపీ ఓటమి తర్వాత కేసుల భయంతో కాషాయగూటిలో చేరారు. అలాగే తమతోపాటు ఉన్న మరో ఎంపీ కనకమేడలను కూడా బీజేపీలో చేర్పించి..టోటల్ రాజ్యసభా పక్షాన్నే బిజేపీలో విలీనం చేశారు.

 

 

అయితే రాజ్యసభలో బలం తక్కువ ఉన్నందున బీజేపీ అధిష్టానం నలుగురు టీడీపీ ఎంపీలను చేర్చుకుంది..కానీ బీజేపీలో ఉన్నా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు వంతపాడుతున్న టీడీపీ ఎంపీలపై ముఖ్యంగా సుజనా చౌదరిపై ఓ కన్నేసి ఉంచింది. అయితే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌, మూడు రాజధానుల వ్యవహారంలో సుజనా చౌదరి చంద్రబాబు తొత్తులా మాట్లాడడంపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీలైన్ కాకుండా టీడీపీ ఎజెండా ఫాలో అవుతున్న సుజనాపై ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలోని కాషాయ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఏపీలో పార్టీ బలోపేతానికి కాకుండా చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ..ఇంకా టీడీపీ ఎంపీలా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి బుద్ధి చెప్పాలని భావించిన బీజేపీ పెద్దలు కొరడా ఝలిపిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే బ్యాంకులు వరుసగా సుజనా చౌదరి ఆస్తుల వేలం వేయడంతోపాటు ఈడీ, సీబీఐకి ఫిర్యాదులు చేస్తున్నాయి. ఇప్పటికైనా బుద్ధి రాకుంటే కేంద్ర సంస్థలు తమ పనితాము చేసుకుంటాయని మేం జోక్యం చేసుకోమని చంద్రబాబు సన్నిహితులైన ముగ్గురు ఎంపీలకు బీజేపీ పెద్దలు పరోక్షంగా సంకేతాలు పంపారు. మొత్తానికి కేసుల భయంతోనే బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు తోక జాడిస్తుండడంతో సీరియస్‌ అయిన బీజేపీ అధిష్టానం ఇంటి దొంగల పని పట్టే పనిలో పడింది. దీంతో చంద్రబాబు తొత్తులుగా పని చేస్తున్న ఎంపీలలో ఆందోళన మొదలైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat