Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై అదరగొడుతున్న కొత్తపాట…సోషల్ మీడియాలో వైరల్..!

చంద్రబాబుపై అదరగొడుతున్న కొత్తపాట…సోషల్ మీడియాలో వైరల్..!

ఆ గట్టునుంటావా…ఈ గట్టునుంటావా…అంటూ రంగస్థలం సిన్మాలో చిట్టిబాబు ఆడి పాడుతుంటే కుర్రకారు తెగ ఊగిపోయారు. ఇప్పుడు అదే ట్యూన్‌లో ‘ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?  ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్.., ఈ పక్కనేమో కడప కారాగారం… నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల అంటూ ఏపీ కుర్రకారు తెగ ఊగిపోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబునుద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. తాజాగా గత గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో ఏపీ సర్కార్‌ పది మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో చంద్రబాబు అవినీతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం… నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల… అని సోషల్ మీడియా కుర్రకారు తెగ ఊగిపోతున్నారు. పాపం అసలే ఎండాకాలం. రెండు ఏసీలేసుకుని పడుకునేవాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో?’ అంటూ తనదైన స్టైల్లో పంచ్ వేశారు.

 

ఇక మరో ట్వీట్‌లో.. ‘దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా ఇప్పుడు కుక్కిన పేనులయ్యారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరు’ అంటూ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈఎస్‌ఐ కుంభకోణంపై కూడా విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘అచ్చన్న దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్‌కు పంపించాడని ఆరోపించారు. పార్టీ అండగా నిలవక పోతే డైరీలన్నీ బయటకు తీస్తానని బెదిరిస్తున్నాడట. లోకేశ్ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. తండ్రీ కొడుకుల కనుసన్నల్లోనే కుంభకోణం జరిగింది. అందుకే అచ్చన్న ధీమాగా ఉన్నాడు’ అంటూ ఈఎస్‌ఐ స్కామ్‌‌లో చంద్రబాబు, లోకేష్‌ల పాత్ర ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? అంటూ చంద్రబాబునుద్దేశిస్తూ విజయసాయిరెడ్డి వేసిన సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat