Home / Uncategorized / ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేసింది టీడీపీ మహిళా కార్యకర్తే…ఇదిగో సాక్ష్యం…!

ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేసింది టీడీపీ మహిళా కార్యకర్తే…ఇదిగో సాక్ష్యం…!

వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై జరిగిన హ‍త్యా ప్రయత్నం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 23, ఆదివారం సాయంత్రం అమరావతిలో జరిగిన రథోత్సవం కార్యక్రమానికి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఒకే కారులో గుంటూరు బయలుదేరిన క్రమంలో లేమల్లె గ్రామంలో టీడీపీ నేతలు తాము వస్తున్న బస్సును అడ్డంపెట్టి ఎంపీని దించారు. బస్సు దిగిన కొందరు మహిళలు జై అమరావతి అంటూ ఎంపీ సురేష్‌ను రాయలేని పదజాలంతో దుర్భాషలాడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. మరికొందరు మహిళలు గన్‌మెన్, ఎంపీ అనుచరులపై కారం చల్లడం మొదలు పెట్టారు. అయితే గన్‌మెన్, సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఎంపీని అక్కడ నుంచి సురక్షితంగా తరలించారు. కాగా పథకం ప్రకారం మహిళలను అడ్డం పెట్టుకుని ఎంపీ సురేష్‌ను అంతమొందించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక మహిళ ఎంపీ సురేష్ కాలర్ పట్టుకుని బండబూతులు తిడుతూ…కళ్లల్లో కారం కొట్టడానికి ప్రయత్నించింది. అయితే తాజాగా ఎంపీపై దాడికి పాల్పడిన సదరు మహిళ టీడీపీ కార్యకర్త అన్న విషయం ఇప్పుడు బయటపడింది. పై ఫోటోలో ఎంపీ కాలర్‌పట్టుకుని దాడి చేస్తున్న మహిళ.. పక్కనే ఇంకో ఫోటోలో చంద్రబాబు, సైకిల్‌ గుర్తు ఉన్న ఎల్లో బైక్‌‌ పట్టుకుని ఫోటో దిగిన మహిళ ఒకరే..దీన్ని బట్టి పథకం ప్రకారం టీడీపీ మహిళా కార్యకర్తలే రాజధాని జేఏసీ ముసుగులో ఎంపీని అంతం చేసే కుట్రలో భాగం అయ్యారని అర్థమవుతుంది. కాగా తనపై దాడి చేసిన వాళ్లు రాజధాని మహిళ కాదని…టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌లు అని ఎంపీ సురేష్ సైతం ఆరోపించారు.

తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో తనపై జరిగిన దాడిపై ఎంపీ సురేష్ మాట్లాడుతూ…అమరావతి జేఏసీ ముసుగులో టీడీపీ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. జేఏసీ పేరుతో తిరిగే వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు? అని ప్రశ్నించారు. లేళ్ల అప్పిరెడ్డి కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, దాడికి సంబంధించిన వీడియో ఉందని చూపించారు. గన్‌మెన్లు, సిబ్బంది కళ్లల్లో మహిళలు కారం చల్లారు. అరే ఎంపీ అంటూ ఏమి పీకుతారు అంటూ నోటి కొచ్చినట్లు తిట్టారు.. కళ్లలో కారం చల్లారు. గతంలో కూడా నాపై దాడి చేశారు. నా పీఎపై చెప్పుతో దాడి చేశారు. నా పక్కన ఉన్న వ్యక్తి కాలర్ పట్టుకొని కొట్టారు. మాపై దాడి చేసినవారు రాజధానికి సంబంధించిన వాళ్లు కాదు… నాపై దాడి చేసిన వారు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులని ఎంపీ సురేష్ స్పష్టం చేశారు.

ఇక టీడీపీ మహిళలు ప్రయాణించిన బస్సులో ఎంపీ గల్లా జయదేవ్‌, ఆలపాటి రాజా ఉన్నారు. బస్సు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లేలోగా అక్కడికి వాళ్లు ఎలా వచ్చారని ఎంపీ ప్రశ్నించారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని సురేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు రాజధాని మీ అబ్బ సొత్తు కాదు. అమరావతి చంద్రబాబు బినామిల రాజధాని. ఆయనను ప్రజలు చెప్పుతో కొట్టినా సిగ్గు రాలేదు. తాను, తన సామాజిక వర్గం మాత్రమే రాజ్యాధికారం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబుది రక్తం రుచి చూసిన చరిత్ర దళితులు ఎప్పుడూ ఊరు బైట ఉండాలనుకొనే చరిత్ర అని ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి బయటకు వస్తుందని తెలిసి మాపై దాడులు చేస్తున్నారని . అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను అంతం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అంటూ ఎంపీ హెచ్చరించారు. ఇక బాబు తొత్తుగా మారిన ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందంటూ ఎంపీ సురేష్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat