తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకెళ్లనున్నారు. మధ్యాహ్నాం పూట బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు.
ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు పోచంపల్లి శాలువా కప్పి .. చార్మీనార్ మెమెంటో ఇవ్వనున్నారు. మెలానియా,ఇవాంకలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోచంపల్లి ,గద్వాల చీరలను అందించనున్నారు.