Home / SLIDER / ఇళ్లు ఎంత ముఖ్యమో…గల్లీ అంతే ముఖ్యం..

ఇళ్లు ఎంత ముఖ్యమో…గల్లీ అంతే ముఖ్యం..

సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులోని నారయణ రెడ్డి కాలనీని సందర్శించారు. వీధి వీధి తిరుగుతూ… కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను చెత్త బండి వస్తూందా లేదా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు వస్తోందని… మహిళలు చెప్పడంతో… మంత్రి హరీశ్ రావు…మున్సిపల్ కమిషనర్ ను పిలిచి చెత్త సేకరణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాలనీలో కరెంటు సమస్యలు ప్రస్తావించడంతో విద్యుత్ శాఖ అధికారులను పిలిచి కాలనీ వాసుల ముందే సమస్యల పరిష్కారనికి కృషి చేయాలని చెప్పారు. 12 ఇళ్ల మీది నుంచి కరెంటు వైర్లు వెళుతున్నాయని ప్రమాదకరంగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్య పరిష్కారించాలని సూచించారు.ఓ ఇంటి ముందు డ్రైన్లో ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన మంత్రి ఆఇంటి మహిళను పిలిచి ఇలా ప్లాస్టిక్ వేయద్దని, తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఉంచాలని, చెత్త సేకరించే వాహనం వచ్చాక ఇవ్వాలని సూచించారు. తమకు గ్యాస్ సిలిండర్లు లేవని కొందరు మహిళలు చెప్పడంతో ఆర్డీవోను పిలిచి అర్హులైన అందరికీ సిలండర్లు వచ్చేలా చూడాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మరి కొందరు మహిళలు రేషన్ షాపు డీలర్ రేషన్ సరిగా ఇవ్వడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. తమను ఇష్టారీతిన దూషిస్తూ మాట్లాడుతున్నారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో దాదాపు పది రోజుల పాటు రేషన్ సరఫరా చేయాలని ఆ సమయాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోను ఆదేశించారు. దీనిపై విచారణ జరిపించి రేషన్ ఎందుకు ఇవ్వడం లేదో చూడాలన్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు స్మశాన వాటికను పరిశీలించారు.
 
కాలనీ పర్యటన అనంతరం మంత్రి హరీశ్ రావు అక్కడి చెరులు కట్ట మీద కాలనీ వాసులతో సమావేశమయ్యారు. వారితో సమస్యలపై, వారి అవసరాలపై మాట్లాడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… పల్లె ప్రగతి రెండు దశల్లో జరిగింది. గ్రామాల్లో చాలా మార్పులు ఈ కార్యక్రమం ద్వారా వచ్చాయి. పట్ణణాల రూపు రేఖలు మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి ప్రారంభించారు. దశల వారీగా మున్సిపాలిటీ రూపు మార్చుకుందాం. మీ ప్రాధాన్యతలేంటో చెప్పండి.. ఆ మేరకు అభివృద్ధి చేసుకుందాం. కొత్త మున్సిపల్ చట్టం ప్రజలకు హక్కులను, బాధ్యతలను అప్పగించింది. పారదర్శకత, జవాబు దారీతనం కోసం ఈ చట్టాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇంటికి అనుమతులు రావాలంటే కష్టం, పేదలు ఇళ్లు కట్టాలంటే ఇబ్బందులు ఉండేవి. అలాంటి వాటిని నివారించేందుకు సీఎం ఈ చట్టాన్ని తెచ్చారు. 75 గజాలలో ఇంటి నిర్మాణానికి 1 రూపాయి కట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి అనుమతులు అవసరం లేదు. 75 గజాల నుంచి 200 గజాలలో ఇళ్లు కట్టుకోవాలంటే మీరే ఇంటి ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా ఇచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనలు విరుద్దంగా కడితే మాత్రం పెద్ద స్థాయిలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రజల్లో మార్పు రావాలంటే చట్టం పట్ల భయం ఉండాలి. చెత్త సమస్య, రేషన్, కరెంటు, పేదలకు ఇళ్లు, మోరీలు బాగు చేయాలని ఇలా పలు సమస్యలు దృష్టికి తెచ్చారు. చెత్త సేకరణ ప్రతీ రోజు జరగాలి. తడి చెత్త, పొడిచెత్త వేర్వేరుగా ఉంచాలి. తడి చెత్తను ప్రతీ రోజు సేకరించేలా చర్య తీసుకుంటాం. పొడి చెత్త వారానికి ఒక సారి తీసుకునేలా చర్య తీసుకుంటాం. ఉదయం పది గంటలకే తడి చెత్త సేకరణ జరుగుతుంది. పొడి చెత్త వేయడానికి మేమే బ్యాగ్స్ సమకూరుస్తాం. పది రోజుల్లో సంగారెడ్డి మున్సిపాలిటికీ ఎన్ని చెత్త సేకరణ బండ్లు కావాలో వాటిని కొనుగోలు చేస్తాం. ఇళ్లు ఎంత ముఖ్యమో…గల్లీ అంతే ముఖ్యం..మీ పట్టణం అంతే ముఖ్యమని ఆలోచించండి.
 
కొత్త మున్సిపల్ చట్టం ప్రజలకు అధికారం ఇచ్చింది. కౌన్సిలర్ పని చేయకపోతే తొలగించే అధికారం కలెక్టర్ కు కట్టబెట్టింది. కౌన్సిలర్లు ఉదయమే…వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. చెత్త రోడ్ మీద పడ వేస్తే… జరిమానా కూడా ఉంటుంది. తడి చెత్త, పొడ్డి చెత్త వేర్వేరుగా ఇవ్వాల్సిందే. పొడి చెత్త రీసైక్లింగ్ కు వెళుతుంది. తడి చెత్త ఎరువుగా మారుతుంది. ఈ విషయాన్ని గ్రహించాలి. ప్లాస్టిక్ వందేళ్లయినా పాడవదు. వాటిని కాలువల్లో వేయవద్దు. ఫంక్షన్ హాలు, అంగన్ వాడీ కేంద్రానికి భవనం కావాలని మహిళలు, యువకులు కోరారు. మూడు నెలలు నేను చెప్పినట్లు రోడ్డుపై చెత్త వేయకుండా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఇస్తే…. మీరు కోరిన ఫంక్షన్ హాలు, అంగన్ వాడీ భవనానికి కొబ్బరికాయ కొడతా.. స్మశాన వాటికను అభివృద్ది చేసుకుందాం. దహన సంస్కారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. వైకుంఠ రథాలు, ఫ్రీజర్లు అందుబాటులోకి తెస్తాం. ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాల్లోను, మీ ఇంటి ముందు చెట్లను పెంచండి. యువత 300 మొక్కలు నాటి వాటిని బతికిస్తే…. వారికి కానుకగా ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయిస్తా. ఇళ్ల స్థలాలకు ఓనర్ షిప్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారు.2 నెలల్లో జిల్లా కలెక్టర్ ఇళ్ల స్థలాలకు సర్ఠిఫికెట్ ఇస్తారు. ఎవరీ లంచాలు ఇవ్వద్దు. హక్కులు తెలుసుకోండి….బాధ్యతలు నెరవేర్చండని స్థానికులకు పిలుపునిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat