Home / ANDHRAPRADESH / అచ్చెంనాయుడి చేతివాటం చూస్తే షాకవడం ఖాయం..దేన్ని వదల్లేదుగా..!

అచ్చెంనాయుడి చేతివాటం చూస్తే షాకవడం ఖాయం..దేన్ని వదల్లేదుగా..!

ఏపీలో సంచలనంగా మారిన ఈఎస్‌ఐ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి  ఎమ్మెల్యే అచ్చెంనాయుడు అడ్డంగా దొరికిపోయారు. తీగ లాగితే డొంక కదిలినట్లు గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అచ్చెం నాయుడు సాగించిన అవినీతి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. గత టీడీపీ హయాంలో మంత్రిగా అచ్చెం నాయుడు అడ్డగోలుగా దోచుకున్నారని..ఆఖరకు తిత్లీ తుఫాను నిధుల్లో కూడా చేతివాటం చూపించారని శ్రీకాకుళం జిల్లాలో చర్చ జరుగుతోంది. ఒక్క తిత్తీ తుఫాన్ పరిహారం పంపిణీలోనే మాత్రమే కాదు….నీరు చెట్టు పథకంలో కూడా అచ్చెం వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక సర్వే నెంబర్ తో భూమిని చూపించి నచ్చినంత సంఖ్యలో చెట్లు పడి పోయినట్టు నమోదు చేయించుకుని అచ్చెం, ఆయన అనుచరులు, టీడీపీ ఛోటామోటా నాయకులు కోట్లాది రూపాయల మేర పరిహారాన్ని మింగేశారని విమర్శలు వస్తున్నాయి. భూముల్లేకపోయినప్పటికీ మ్యూటేషన్ చేయించి అక్రమంగా పట్టాదారు పాసు పస్తకాలను తయారు చేయించి మరీ పరిహారం కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక నీరు చెట్లు పనుల్లో కూడా అచ్చెం భారీ అవినీతికి పాల్పడినట్లు సమాచారం. నీరు–చెట్టు పనుల్లో భాగంగా రూ.5 లక్షల విలువ కన్నా ఎక్కువగా ఉండే పనుల కాంట్రాక్టులన్నింటిని టెండర్లకు పిలువకుండా అచ్చెం నాయుడు నామినేషన్ పద్దతిలో తమ అనుచరులకు కట్టబెట్టారు. జిల్లాలో రూ.427.24 కోట్ల విలువైన 5696 పనుల్లో అత్యధికం అలా దక్కించుకున్నవే. వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పనులు జరుగకపోయినా..జరిగినట్లు బిల్లులు చూపించి..కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మింగేశారని జిల్లాలలో చర్చ జరుగుతోంది. మట్టి తవ్వకాల కింద క్యూబిక్ మీటర్కు రూ.29కు గాను ఏకంగా రూ.82.80 చెల్లించి భారీగా కమీషన్లు కొట్టేశారని తెలుస్తోంది.

ఇక నీరు చెట్లు పథకంలో నిబంధనల ప్రకారం 50 ఎకరాలు ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి….అచ్చెం నాయుడి ఇలాకాలో మాత్రం అందుకు భిన్నంగా 50 ఎకరాలు కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు చేపట్టి భారీగా నిధులు కొల్లగొట్టారని తెలుస్తోంది. అయితే తిత్లీ తుఫాను పరిహారాన్ని అప్పనంగా కాజేసిన టీడీపీ నేతలు దర్యాప్తులో బయటపడకుండా చాలా జాగ్రత్తలు పడ్డారని, నిబంధనలోని లొసుగులను అడ్డం పెట్టుకుని బినామీల పేరుతో కొట్టేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిత్లీ తుఫాను పరిహారాన్ని పెంచడంతో అచ్చెం నాయుడి, ఆయన అనుచరుల అవినీతి గుట్టు బయటపడింది. కాగా కింజరాపు అచ్చెంనాయుడి కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులను ఆధారాలతో సహా బహిర్గతం చేయడానికి మార్చి 2న టెక్కలి అంబేడ్కర్ జంక్షన్ వద్ద బహిరంగ చర్చా వేదిక నిర్వహిస్తామని…అచ్చెన్నాయుడుకు దమ్ముంటే చర్చా వేదికకు వచ్చి తన నిజాయితీ నిరూపించుకోవాలని వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ సవాల్ విసిరారు. మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన అక్రమాలు అవినీతి కార్యకలాపాలపై ఆధారాలతో సహా సీఎం జగన్‌‌‌కు లేఖ అందజేస్తున్నామని పేరాడ తిలక్ ప్రకటించారు. కాగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అచ్చెం నాయుడు ఇప్పుడు ఈఎస్‌ఐ స్కామ్‌తో పాటు తిత్లీ పరిహారం, నీరు చెట్టు స్కామ్‌లలో పీకల్లోతు ఇరుక్కున్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌ నేపథ్యంలో తవ్వే కొద్ది అచ్చెం అవినీతి అక్రమాలు బయటపడుతుండడంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు..ఆఖరకు తుఫాను బాధితుల పరిహారాన్ని కూడా మింగేసిన అవినీతి అన కొండ..అచ్చెం అంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై అచ్చెం నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat