Home / ANDHRAPRADESH / ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఏసీబీ వరుసదాడులు…అవినీతిపరుల గుండెల్లో రైళ్లు..!

ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఏసీబీ వరుసదాడులు…అవినీతిపరుల గుండెల్లో రైళ్లు..!

సీతారామాంజనేయులు…ఈ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారి బరిలోకి దిగాడంటే..అవినీతిపరులకు మూడుకున్నట్లే..అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లే…నీతి, నిజాయితీ, కర్తవ్యపాలనలో రాజీలేని తత్వం, అవినీతిని సహించలేని తత్వం..ఆయన్ని పోలీస్ శాఖలో ప్రత్యేకంగా నిలిపాయి..అందుకే అందరూ ఆయన్ని ఆంధ్రా సింగం అంటూ ముద్దుగా పిలుస్తుంటారు…1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం, గుంటూరు కర్నూలు జిల్లాలకు ఎస్పీగా చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా రౌడీలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఐపీఎస్ సీతారామాంజనేయులుకు మంచి అనుబంధం ఉంది. అందుకే జగన్ ముఖ్యమంత్రి కాగానే…ఏరికోరి కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి తీసుకువచ్చారు. వచ్చీ రాగానే రవాణా కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీతారామాంజనేయులు ఆ శాఖలోని అవినీతిని ఏరిపారేశారు. దశాబ్దాలుగా రవాణా రంగంలో అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌ ఆట కట్టించారు. అక్రమంగా తిరుగుతున్న 80 కు పైగా దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయించి జేసీ గుండెల్లో వణుకు పుట్టించారు. అలాగే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అక్రమ వ్యాపారాలను బయటపెట్టి సంచలనం రేపారు.

 

ఇక ఏపీలో అవినీతిపై యుద్ధం ప్రకటించిన సీఎం జగన్ సీతయయ్యను ఏసీబీ డీజీగా నియమించారు. జగన్ సహకారంతో సీతయ్య దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రెవిన్యూ, మున్సిపల్,, ఆర్టీవో, ట్రావెల్స్ శాఖలపై వరుస దాడులు నిర్వహించి అక్రమార్కుల తాట తీశారు. తాజాగా ఈఎస్‌ఐ స్కామ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చంద్రబాబు హయాం నుంచి మందుల కొనుగోలులో, పరికరాల కొనుగోలులో, రిక్రూట్‌మెంట్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికితీయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇవ్వడంతో సీతయ్య రంగంలోకి దిగారు. ప్రస్తుతం సీతయ్య నేతృత్వంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో  ప్రభుత్వ ఆస్పత్రులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులలో 13 టీములు 100 మంది అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్పత్రుల అక్రమాలు వెలుగుచూస్తున్నట్టు తెలిసింది. చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించకుండా ప్రైవేట్ వైద్య శాలలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా వున్నట్టు తెలుస్తుంది. ఏసీబీ చీఫ్ గా ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ సహా ఆర్టీవో ట్రావెల్స్ శాఖల్లో అక్రమార్కుల ఆట కట్టించి సంచలనం రేపిన ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అక్రమాలపై పడడం ఏపీ ప్రభుత్వ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. మొత్తంగా సీఎం జగన్ అండతో సీతయ్య ఆంధ్రా సింగంలా చెలరేగిపోతున్నారు. సీతయ్య దూకుడుతో అవినీతిపరులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటే సందేహం లేదు..హ్యాట్సాఫ్ సీతయ్య.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat