Home / ANDHRAPRADESH / పవన్ కల్యాణ్‌‌కు మరోసారి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక…!

పవన్ కల్యాణ్‌‌కు మరోసారి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక…!

రాపాక వరప్రసాదరావు…జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక తన వ్యవహార శైలితో అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కొరకరాని కొయ్యలా మారారు. పార్టీ లైన్‌కు విరుద్ధంగా గతంలో పలుమార్లు బహిరంగంగా సీఎం జగన్‌ను మెచ్చుకున్న గట్స్ రాపాక సొంతం. ఒకపక్క పవన్ కల్యాణ్ జగన్ సర్కార్‌‌కు వ్యతిరేకంగా రాజకీయంగా చేస్తుంటే..రాపాక మాత్రం సీఎం జగన్‌ పాలనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తానే స్వయంగా రెండుసార్లు జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి పార్టీలో కలకలం రేపారు. అంతే కాదు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబు ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానుల ఏర్పాటుపై పవన్ కల్యాణ్ ను విబేధిస్తూ రాపాక సీఎం జగన్‌ నిర్ణయాలకు జై కొట్టారు. కాగా చంద్రబాబుకు తొత్తుగా రాజకీయాలు చేస్తున్న పవన్ తీరు నచ్చకనే రాపాక స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారని…ఆయన వర్గీయులు అంటున్నారు. గతంలోనే ప్రభుత్వం మంచి చేస్తే ప్రశంసిస్తా..చెడు చేస్తే విమర్శిస్తా అని రాపాక ప్రకటించారు. ఆ మేరకే నడుచుకుంటున్నారు. కాని రాపాక వ్యవహార శైలి మాత్రం పవన్‌తో సహా జనసేన శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ఇటీవల పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ..మా ఎమ్మెల్యే రాపాక మా పార్టీలో ఉన్నాడో లేదో తెలియదంటూ చురకలు అంటించారు.

అయితే తనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ రావు స్పందించారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాపాక మీడియాతో మాట్లాడుతూ సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా మరోసారి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్నానని రాపాక ప్రకటించారు. విశాఖపట్నం రాజధానిగా ఉంటే గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలన్ని అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని స్పష్టం చేశారు. ఇక జనసేన ఎమ్మెల్యే మా పార్టీలో ఉన్నాడో లేదో తెలియదంటూ అధ్యక్షుడు పవన్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా రాపాక స్పందించారు. పవన్‌ కల్యాణ్‌‌ను తాను ఈ మధ్య కాలంలో కలవలేదని..తనకు ఆయన దగ్గర గురించి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారు. తాను జనసేన పార్టీకి దూరంగా లేను..అలాగని దగ్గరగా లేను.. కాని జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు..తనకు ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు తెలుపుతానని ముందే చెప్పానని ఈ సందర్భంగా రాపాక గుర్తు చేశారు. అయితే పార్టీ పరువు తీస్తున్న రాపాకను సస్పెండ్ చేయాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నా…పవన్ ధైర్యం చేయడం లేదు..ఒక వేళ సస్పెన్షన్ చేసినా…వల్లభనేని, మద్దాలి తరహాలో అసెంబ్లీలో రాపాక స్వతంత్ర్యంగా వ్యవహరించేందుకు డిసైడ్ అయ్యారని అందుకే పవన్‌ను లెక్కచేయడం లేదని…జనసేన శ్రేణులు అంటున్నాయి. మొత్తంగా అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కలువలేదని, తాను జనసేన పార్టీకి దగ్గరగా లేను..దూరంగా లేను అంటూ రాపాక వరప్రసాద్‌రావు చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat