Home / POLITICS / మార్చ్ 1న ఖమ్మం జిల్లాకు మంత్రి కేటీఆర్..!

మార్చ్ 1న ఖమ్మం జిల్లాకు మంత్రి కేటీఆర్..!

పట్టణ ప్రగతి లో ప్రభుత్వం నేరుగా ఇస్తున్న నిధుల ద్వారా అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా ప్రజాప్రతినిధులకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా ఖమ్మం నగరంలోని డివిజన్లలో కలియ తిరుగుతూ మొక్కలు నాటి, విద్యుత్ పలు సమస్యలపై మంత్రి ఆరా తీశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం ముమ్మురంగా సాగుతోంది. అభివృద్ధి ప్రణాళిక పేరుతో పల్లెల ప్రగతిని పోటాపోటీగా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పట్టణ ప్రగతి పై ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. దానికి తోడు పట్టణ ప్రగతిలో మొదటి ప్రాధాన్యత అంశాలుగా విద్యుత్ సమస్యలు, డ్రైన్లు శుభ్రపరచుట, పర్యావరణం, డంపింగ్ యార్డ్ ల ఏర్పాటు తో పాటు శ్మశాన వాటికల నిర్వహణకు పెద్ద పీట వేయడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం నగరంలో 14 వ డివిజన్ ముస్తఫా నగర్, 35వ డివిజన్ మామిళ్లగూడెం, 42వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్, 3వ డివిజన్ బల్లెపల్లి లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పట్టణ ప్రగతిలో పాల్గొని మొక్కలు నాటారు.

అనంతరం కొనసాగుతున్న విద్యుత్ స్తంభాలు మరమ్మతుల పనులు, కాల్వల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పట్టణ ప్రగతిలో మొక్కల నాటడం, కాల్వలు శుభ్రం చేయటం, విద్యుత్ సమస్యలు పరిష్కారం చేయడం, పర్యావరణానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రతి ఇంటిలో 30% శాతానికి పై బడి మొక్కలు నాటాలి. ఇంట్లో స్థలం లేనివారు రూప్ గార్డెన్ లపై దృష్టి సారించాలని కోరారు. మొక్కలు పెంపకంలో 85 శాతానికి పై చిలుకు బతికేల శ్రద్ధ చూపాలి, పారిశుద్ధ్య నిర్వహణ లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న పర్యావరణ సమస్యను అధిగమించాలి. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న శ్రమ శ్లాఘనీయమన్ని కొనియాడారు.అటు పల్లె ప్రగతిలో ఇటు పట్టణ ప్రగతిలోనూ పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వడం అందులో భాగమే అని పేర్కొన్నారు. చెత్త సమస్య మానవాళికి సవాల్ విసురుతోందని, చెత్త నుండి మురికి కుంటల నుండి పుట్టిన చిన్న దోమ ప్రాణాంతకంగా మారుతున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ ల ఏర్పాటు అందులో భాగమే. తడి చెత్త పొడిచెత్త లను వేరు చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలిన అవసరం ఉందన్నారు.

పారిశుధ్యం పై ప్రణాళికలు రూపొందించి అందులో ప్రజలను భాగస్వామ్యం చెయ్యాలి. ఫోటోలకు ఫోజులు కాకుండా పనులపై దృష్టి పెట్టాలని, ఇప్పుడు బాగు చేసుకోకపోతే ఎప్పటికి చేసుకోలేము చెప్పారు. పట్టణ ప్రగతిలో అధికారుల అలసత్వం సహించం. నిర్లక్ష్యం వహించిన వారు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పట్టణ ప్రగతి పై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ఆశలు పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా ఉండాలన్నారు. మార్చి 1వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉందని, అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమీషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పాపాలాల్ గారు, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS గారు, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి IAS గారు, విద్యుత్ SE రమేష్ గారు, కార్పొరేటర్లు మండదపు మనోహర్, రుద్రాగని శ్రీదేవి, ఊట్కూరు లక్ష్మీ సుజాత గారు, దోరేపల్లి శ్వేత గారు, కమర్తపు మురళి గారు, కొనకంచి సరళ గారు ఆయా డివిజన్ల స్పెషల్ ఆఫీసర్లు, నాయకులు ఉన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat