Home / ANDHRAPRADESH / ఈఎస్‌ఐ స్కామ్‌లో సంచలనం రేపుతున్న విజిలెన్స్ నివేదిక..!

ఈఎస్‌ఐ స్కామ్‌లో సంచలనం రేపుతున్న విజిలెన్స్ నివేదిక..!

ఏపీలో ఇటీవల బయటపడిన ఈఎస్‌ఐ స్కామ్‌లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెంనాయుడు పీకల్లోతు ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఈఎస్ ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో పలు అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ నివేదిక సారాంశం. చంద్రబాబు హయాంలో 2016 నవంబరులో టెలి హెల్త్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి పనులు ఇవ్వండి అని అప్పటి కార్మిక మంత్రి అచ్చెంనాయుడు ఒక లేఖ రాశారు. అందులో స్పష్టంగా ఆ సంస్థతో ఎంఓయు కుదుర్చుకోండి అని రాసి ఉంది. దీంతో అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఆ లేఖ ఆధారంగా ఈసీజీ సేవలు, ఇంకా టోల్ ఫ్రీ సేవల కోసం వారికి నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారు.

 

మార్కెట్లో సుమారు రూ. 200 కంటే ఎక్కువ ఖర్చుకాని ఈసీజీకి రూ.480 రూపాయలు చొప్పున ఆ సంస్థకు చెల్లించారు. ఇక ఎన్ని ఫోన్లు, ఎక్కడి నుంచి వచ్చాయన్న దాంతో సంబంధం లేకుండా కాల్ సెంటర్ బిల్లులు ఇచ్చేశారు. ఆ సంస్థకు రూ.8 కోట్లు చెల్లించారు.2014 – 2019 మధ్య ఐఎంఎస్ కి ముగ్గురు డైరెక్టర్లు పని చేశారు. ఈ ముగ్గురి హయాంలో మందులు కొనడానికి రూ.293 కోట్ల 51 లక్షలు కేటాయించగా, వారు ఏకంగా రూ.698 కోట్ల 36 లక్షల విలువైన మందులు కొన్నారు. అంటే అదనంగా రూ.404.86 కోట్లు ఖర్చు చేశారు. అలాగే లేని షెల్ కంపెనీలు క్రియేట్ చేసి – నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందని సమాచారం. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ ఐ డైరెక్టర్లు ఏకంగా రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారట. ఇక మందులు – పరికరాలను 135శాతం అధిక ధరకు టెండర్లలో చూపించారని తేలినట్లు తెలుస్తోంది. నకిలీ కొటేషన్లు – షెల్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. మొత్తం అవినీతి జరిగిన రూ.151 కోట్లలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడి భాగస్వామ్యం ఉందని వైయస్సార్సీపీ నాయకులు పి గౌతం రెడ్డి ఆరోపించారు.

 

తాజాగా ఈఎస్‌ఐ స్కామ్‌పై ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరామ్ స్పందించారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామనీ, ఎవర్నీ వదలిపెట్టబోమని మంత్రి జయరామ్ మీడియా ముందు ప్రకటించారు. చంద్రబాబు హయాంలో ఈఎస్‌ఐ స్కాంలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. మాజీ కార్మిక మంత్రులు అచ్చెం నాయుడు, పితాని సత్యనారాయణ హయాంలోనే ఈ అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. . ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలను టీడీపీ దోచుకుందని విమర్శించారు. దీంతో నేడు చంద్రబాబు కూడా ముద్దాయి అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక బాబుతోపాటు అప్పటి కార్మికశాఖ మంత్రులిద్దరూ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నతోపాటు చంద్రబాబు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat