ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. చైనా సైతం ఈ వైరస్ ధాటికి భయపడుతుంది. ఇక ఈ వైరస్ కోసం తాజాగా వచ్చిన సమాచారం చూసుకుంటే చైనా నుండి ఉద్భవించిన కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, స్విట్జర్లాండ్ వచ్చే వారం జెనీవా అంతర్జాతీయ కార్ షోను రద్దు చేసింది. ఈ ప్రదర్శన పరిశ్రమ యొక్క అతి ముఖ్యమైన సమావేశాలలో ఒకటి అని చెప్పాలి. ఇక మెక్సికో, నైజీరియా, న్యూజిలాండ్, లిథువేనియా, బెలారస్ మరియు అజర్బైజాన్ మొదటి కేసులను నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ ఇటలీ మరియు బ్రెజిల్ తరువాత వైరస్ నమోదు చేసిన రెండవ లాటిన్ అమెరికన్ దేశం మెక్సికోనే