Home / ANDHRAPRADESH / పంచుమర్తికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత…!

పంచుమర్తికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత…!

పంచుమర్తి అనురాధ…ఈ టీడీపీ మహిళా నేత చంద్రబాబుకు, లోకేష్‌కు వీర భక్తురాలు…ప్రతి నిత్యం న్యూస్ టీవీ ఛానళ్లలో పొద్దున్నే డిబెట్లలో కూర్చుని సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటుంది. ఈవిడ గారికి కాస్త నోరు ఎక్కువే.  ఏదైనా టాపిక్‌పై ఆధారాల్లేనప్పుడు అడ్డగోలుగా మాట్లాడి… ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడం ఎలాగో టీడీపీ స్కూల్లో రెండాకులు ఎక్కువే చదివింది. డిబెట్లలో పాల్గొన్న నేతలు ఈవిడ గారి విమర్శలకు కౌంటర్ ఇస్తే…ఓ మహిళను పట్టుకుని ఇలాగేనా మాట్లాడేది అంటూ రంకెలు వేస్తూ టాపిక్‌ను విజయవంతంగా పక్కదారి పట్టించడంలో అనురాధ ఆరితేరిపోయారు.

 

తాజాగా విశాఖలో ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ల్యాండ్‌పూలింగ్‌పై టీడీపీ రాజకీయం చేస్తోంది. ఈ క్రమంలో విశాఖలో జరుగుతున్న ల్యాండ్‌ పూలింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, జగన్ బినామీల పేరుతో భూములు దోచుకున్నారని పంచుమర్తి ఆరోపించింది. అయితే సీఎం జగన్‌పై పంచుమర్తి విమర్శలపై వైసీపీ మహిళా నేత, మాజీ మేయర్ తాడి శకుంతల మండిపడ్డారు. టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆమె హెచ్చరించారు. సీఎం జగన్‌పై అనురాధ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో ప్రసాద్‌ ఇండ్రస్టీ పేరుతో పేద బ్రాహ్మణులకి వేద పాఠశాల కోసం కేటాయించిన భూమిని అన్యాక్రాంతం చేసింది నువ్వు కాదా అని దుయ్యబట్టారు. ఇష్టానుసారం మాట్లాడే అనురాధ.. కనకాంబ ట్రస్ట్‌పై ఎందుకు మాట్లాడటం లేదని తాడిశకుంతల ప్రశ్నించారు.

 

కాగా విజయవాడ నడిబొడ్డున వేద పాఠశాల ఏర్పాటు చేయాలన్న ఓ ట్రస్టు ఆశయాన్ని టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ కుటుంబానికి చెందిన ప్రసాదరావు తుంగలో తొక్కి, భూమిని కబ్జా చేసిన విషయం ఇటీవల బట్టబయలైంది. 2000 సంవత్సరంలో చంద్రబాబు సీఎంగా ఉన్న ఆ సమయంలో అప్పటి దాకా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న శ్రీకాంచనపల్లి కనకాంబ ట్రస్టు నిర్వహణను కొన్ని మినహాయింపులతో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. ఈ ట్రస్టుకు విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న లబ్బీపేటలో దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల విలువ చేసే భూములున్నాయి.అప్పట్లో విజయవాడ నగర మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పంచుమర్తి అనురాధ కుటుంబ సభ్యులు ఈ ట్రస్టు భూములను అక్రమ మార్గంలో చేజిక్కించుకున్నారు. ఆక్రమించుకున్న భూమిలో ఏకంగా షెడ్డు వేసి, ఓ ఫ్యాక్టరీ కూడా నెలకొల్పారు. ప్రస్తుతం దేవాదాయశాఖ ఆ భూములను తిరిగి స్వాధీనం చేసే పనిలో పడింది. ఇదే విషయంపై తాడి శకుంతల మాట్లాడుతూ పంచుమర్తి కబ్జాల పర్వాన్ని నిలదీశారు. విజయవాడలో మాజీ మేయర్లకు మంచి పేరు ఉందని.. ఆ పేరును ఆమె చెడగొట్టారని నిప్పులు చెరిగారు. అనురాధకు ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌ని విమర్శించే అర్హత లేదన్నారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడమే కాకుండా…విజయవాడలో పలు భూదందాలకు పాల్పడిన పంచుమర్తి అనురాధపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని శకుంతల డిమాండ్‌ చేశారు. మొత్తంగా పంచుమర్తికి వైసీపీ మహిళా నేత తాడి శకుంతల అదిరిపోయే పంచ్ ఇవ్వడం విజయవాడ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat