Home / ANDHRAPRADESH / లోకేష్ విందు భేటీపై తెలుగు తమ్ముళ్ల ఫైర్… చంద్రబాబు సీరియస్ క్లాస్..!

లోకేష్ విందు భేటీపై తెలుగు తమ్ముళ్ల ఫైర్… చంద్రబాబు సీరియస్ క్లాస్..!

నారా వారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్, తన సతీమణి బ్రాహ్మణితో కలిసి హైదరాబాద్‌లోని తమ ఇంట్లో పార్టీకి చెందిన యువనేతలతో విందు రాజకీయం నడిపాడు. తన నాయకత్వంపై రోజు రోజుకీ నమ్మకం కోల్పోతున్న వేళ…లోకేష్ ఇలా వారసులపై ఫోకస్ పెట్టడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విందు భేటీలో భవిష్యత్తులో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహంపై, పార్టీ బలోపేతంపై చర్చలు జరిగినట్లు సమాచారం. అలాగే టీడీపీ సీనియర్లు లోకేష్‌ తీరుపై విసిగిపోయి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్న తరుణంలో జరిగిన ఈ విందు రాజకీయం వెనుక మతలబు ఏంటనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఆయన సోదరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, జేసీ పవన్, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల, బండారు సత్యనారాయణ వంటి నేతల కుమారులు, కోడళ్లు, మాజీ స్పీకర్ స్వర్గీయ కోడెల శివప్రసాద్ రావు కుమారుడు శివరామ్ పాల్గొన్నారు. దాదాపు ఉదయం 10 గంలకు మొదలై సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఈ విందు సమావేశానికి సంబంధించి ఫోటోలు కూడా మీడియాకు రిలీజ్ చేశారు. ఇందులో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ వారసుల మీటింగ్‌పై టీడీపీ సీనియర్ నేతలతో పాటు, క్యాడర్ కూడా రివర్స్‌లో పంచ్‌లు వేస్తున్నారు. చినబాబు నీ యాక్షన్ ప్లాన్స్ ఏం బాగాలేవంటూ మండిపడుతున్నారు. ఈ లంచ్ భేటీలో పాల్గొన్న వారిలో న‌లుగురు మాత్ర‌మే యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నార‌ని…మిగ‌తావారు ఎవరూ యాక్టివ్‌గా లేర‌ని…ఈ వారసులతో పార్టీకి లాభం లేద‌ని కొంద‌రు కామెంట్స్ చేశారు.

ఇప్పటికే కోడెల వారసుడు శివరామ్ పీకల్లోతు కేసుల్లో ఇరుక్కున్నారని, అలాగే బొజ్జల, అయ్యన్నపాత్రుడు, కేఈ, బండారు సత్యనారాయణల కుమారులు, జేసీ వారసులపై పలు భూ కబ్జాల కేసులు, హత్యకేసులు ఉన్నాయని..వీరితో టీడీపీ బలోపేతం అవుతుందా అని కార్యకర్తలు లోకేష్‌ను నిలదీస్తున్నారు. పార్టీలోకి కొత్త రక్తం అంటే ఇలాంటి వారసులతో మీటింగ్ కాదని… గ్రౌండ్ లెవ‌ల్లో పార్టీ కోసం ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు పెడితే టీడీపీకి మంచి జోష్ వ‌స్తుంద‌ని తెలుగు తమ్ముళ్లు దెప్పిపొడుస్తున్నారు. ఇన్నాళ్లు వీళ్ల తండ్రులను గెలిపించాం…ఇప్పుడు వీరిని గెలిపించాలా? వేరే నేత‌లు పార్టీలో పైకి రావొద్దా? మళ్లీ వారసులకే ఊడిగం చేయాలా…అసలు లోకేష్ ఏం సందేశం ఇస్తున్నార‌ని మ‌రికొంద‌రు కార్యకర్తలు మండిపడ్డారు.

పార్టీకి యువనాయకులు అంటే గెలిచే సత్తా ఉన్న నాయకులు కావాలి..ఓడిపోయిన నాయకులు కొడుకులు, కూతుర్లు కాదు అంటూ తెలుగు తమ్ముళ్లు మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్‌పై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి జగన్‌ను ఎదుర్కోవడానికి, పార్టీలో తన పట్టును నిరూపించుకోవడానికి లోకేష్ తన సతీమణిని దింపి మరీ పార్టీ ఇస్తే మైలేజీ దక్కకపోగా… పూర్తిగా రివర్స్ పంచ్‌లు పడుతున్నాయి. అంతే కాదు పార్టీలో బ్రాహ్మణి పెత్తనం స్టార్ట్ అవుతుందని, లోకేష్ ఇక పెళ్లాంచాటు మొగుడే అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. దీంతో చంద్రబాబు లోకేష్‌ను పిలిచి ఇట్లాంటి మీటింగ్‌లు మళ్లీ పెట్టి పరువు తీసుకోవద్దని గట్టిగా క్లాసు తీసుకున్నాడని సమాచారం. మొత్తంగా లోకేష్ విందు రాజకీయంపై సొంత పార్టీ క్యాడర్‌లో వ్యతిరేకత రావడం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat