Home / ANDHRAPRADESH / సంచలనం…రూ. 2 వేల కోట్ల స్కామ్‌లో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..!

సంచలనం…రూ. 2 వేల కోట్ల స్కామ్‌లో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..!

ఏపీ, తెలంగాణలో జరిపిన సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్‌‌కు సంబంధించిన దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల 400 కోట్ల ముడుపుల బాగోతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌‌లో చేరానని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ తప్పించుకున్నాడు. కాగా మరోసారి ఐటీశాఖ అధికారులు అహ్మద్ పటేల్‌కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌‌పై జరిపిన ఐటీ దాడుల్లో వెలుగులోకి వచ్చిన 2 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించి కీలక ఆధారాలను ఐటీశాఖ సేకరించినట్లు తెలుస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీకి అందజేసినట్లు ఐటీశాఖ గుర్తించినట్లు సమాచారం. కాగా చంద్రబాబు హయాంలో అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో నిర్మాణపనులకు ఎంపిక చేసిన మూడు సంస్థలలో ఒకటైన ఓ ప్రముఖ కంపెనీ తాత్కాలిక సచివాలయ భవనాన్ని కూడా నిర్మించింది. అదే కంపెనీకి నాటి బాబు సర్కార్ అమరావతిలో వివిధ వర్గాల వారికి 2652 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన గృహాల సముదాయ నిర్మాణపనులను కూడా కట్టబెట్టింది. ప్రతిగా 20 శాతం ముడుపులు ముట్టజెప్పే విధంగా సదరు కంపెనీతో టీడీపీ పెద్దలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తమకు భారీగా ప్రభుత్వ కాంట్రాక్టులను కట్టబెట్టినందుకుగాను…సదరు నిర్మాణ కంపెనీ టీడీపీ పెద్దలకు మొత్తం 700 కోట్ల కమీషన్ కింద చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సదరు కంపెనీ నుంచి తొలి దశలో 150 కోట్ల రూపాయలు అధికారికంగా చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో బయటపడింది.

సదరు నిర్మాణ కంపెనీ నుంచే గత టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్యనేతకు 150 కోట్లు చేరినట్లు ఐటీ శాఖ నిర్థారించింది. అందుకే గత ఏడాది నవంబర్ 11 న 150 కోట్ల రూపాయలు తీసుకున్న ఆంధ్రుడు అంటూ..ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ద్వారా ఐటీ శాఖ ప్రకటించింది. అమరావతిలో రూ.2652 కోట్ల పనులకు సంబంధించి…సదరు నిర్మాణ కంపెనీ నాటి ముఖ్యనేతకు చెల్లించిన ముడుపుల ఆధారాలు ఐటీ అధికారుల చేతికి చిక్కాయి. సదరు నిర్మాణ సంస్థ నుంచి 150 కోట్ల క్యాష్ తీసుకున్న ఆ ముఖ్య నేత ఎవరో ఐటీ శాఖ అధికారులు ఆధారాలతో సహా రూడీ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఏపీలోని ఆ ముఖ్య నేతను ఐటీ శాఖ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌ను ఆరు రోజుల పాటు ఐటీ శాఖ అధికారులు విచారించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. సో.. 400 కోట్ల ముడుపుల బాగోతంలో అహ్మద్‌పటేల్‌, 150 కోట్ల ముడుపుల బాగోతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 2 వేల కోట్ల స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది. మరి ఈ 150 కోట్ల కమీషన్ల బాగోతంలో ఐటీ శాఖ అధికారులు చంద్రబాబు‌ను విచారిస్తారో లేదో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat